BigTV English

Shehbaz Sharif: పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. రేపే ప్రమాణస్వీకారం..

Shehbaz Sharif: పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. రేపే ప్రమాణస్వీకారం..

Shehbaz Sharif Elected as Prime Minister of PakistanShehbaz Sharif Elected as Prime Minister of Pakistan(Today’s international news): పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. 336 మంది సభ్యులున్న సభలో పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఏకాభిప్రాయ అభ్యర్థిగా బరిలోకి దిగిన షెహబాజ్ కు 201 ఓట్లు వచ్చాయి.


జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన ఒమర్ అయూబ్ ఖాన్ 92 ఓట్లు సాధించారు.

కొత్త పార్లమెంటు సమావేశాలు పీటీఐ-మద్దతుగల శాసనసభ్యుల గందరగోళం, నినాదాల మధ్య సమావేశమయ్యాయి.


షెహబాజ్ సోమవారం రాష్ట్రపతి భవనమైన ఐవాన్-ఎ-సదర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read More: మేం మీ కీలు బొమ్మలం కాదు.. చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్..

షెహబాజ్ అంతకుముందు ఏప్రిల్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా పనిచేశారు, సాధారణ ఎన్నికలను నిర్వహించడానికి పార్లమెంటు రద్దు చేశారు.

గత నెల జరిగిన ఎన్నికల్లో PML-N పార్టీకి 75 సీట్లు రాగా, పీపీపీ పార్టీకి 54 సీట్లు వచ్చాయి. MQM-P పార్టీ 17 సీట్లు గెల్చుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో మొత్తం 101 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. JUI పార్టీ 4, PML-Q 3, IPP 2, BNP రెండు సీట్లను గెల్చుకుంది.

265 సీట్లు ఉన్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాట్ చేయాలంటే 133 సీట్లు గెలవాలి. ఏ పార్టీకి కూడా సంపూర్ణ మద్దతు రాకపోవడంతో పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×