BigTV English

Matka Movie First Look: ‘మట్కా’ కింగ్.. రెండు లుక్స్‌లో వేరియేషన్ చూపించిన వరుణ్ తేజ్

Matka Movie First Look: ‘మట్కా’ కింగ్.. రెండు లుక్స్‌లో వేరియేషన్ చూపించిన వరుణ్ తేజ్

Varun Tej Matka First Look: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు తీస్తున్నాడు. అయినా సరైన ఫలితం దక్కడం లేదు. గతేడాది రెండు సినిమాలు తీసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘మట్కా’ అనే పేరు పెట్టారు.


వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో మట్కా రూపొందుతుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, బాలీవుడ్ ముద్దుగుమ్మ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సలోని, కన్నడ కిషోర్, అజయ్ ఘేష్, రవీంద్ర విజయ్, పి రవిశంకర్ సహా ఇతర నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి కలిసి భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: మట్కా మేకింగ్ వీడియో.. వామ్మో వరుణ్ కోసం అన్ని సూట్లు.. చైన్లా..?


ఇప్పటికే ఈ మూవీ పట్టాలెక్కి చాలా నెలలు అయింది. ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా మేకర్స్ మరో అప్డేట్‌ అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ మేరకు ఈ సినిమా నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో వరుణ్ లుక్ అత్యద్భుతంగా ఉంది. వరుణ్ అందులో మిడిల్ ఏజ్‌డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అదే లుక్‌లో కింద మరో యాంగిల్‌ను చూపించారు. ఆ పోస్టర్‌లో కిందవైపు వరుణ్ మరో లుక్ యంగ్‌గా చూపించి అదరగొట్టేశారు.

గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఫుల్ మాస్ యాక్షన్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఓ యువకుడి లైఫ్‌లో 24 ఏళ్ల నుంచి మట్కా సామ్రాజ్యానికి రాజుగా ఎలా ఎదిగాడు అనేది చూపించబోతున్నారు. కాగా ఇందులో వరుణ్ మొత్తం నాలుగు డిఫరెంట్ గెటప్స్/ లుక్స్‌లో కనిపించబోతున్నాడు. అందులో రెండు గెటప్స్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×