BigTV English

America : మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పులు.. ముగ్గురు బలి..

America : మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పులు.. ముగ్గురు బలి..

America : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. ఈస్ట్ లాన్సింగ్స్ లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ లోకి సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. క్యాంపస్‌లోని 2 భవనాల వద్ద కాల్పులకు తెగబడ్డాడు.


ఆగంతకుడు కాల్పులు ప్రారంభించగానే విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు. ప్రాణభయంతో
వెంటనే గదుల్లోకి పరుగులు పెట్టారు. అప్పటికే కొందరి శరీరాల్లోకి తుటాలు దూసుకెళ్లాయి. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. 10 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాల్పులకు పాల్పడిన తర్వాత నిందితుడు మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ నుంచి పారిపోయాడు. కాల్పుల ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


అమెరికాలో అతిపెద్ద ఉన్నత విద్యాసంస్థల్లో మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఒకటి. ఈస్ట్‌ లాన్సింగ్‌ క్యాంపస్‌లో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పుల ఘటన తర్వాత రెండు రోజులపాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దుచేశారు.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×