Shubhanshu Shukla : ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఇండియన్ అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా చరిత్రలో తొలిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అడుగుపెట్టారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ సక్సెస్‌ఫుల్ డాకింగ్ తర్వాత తొలిసారి ISSలోకి ఎంట్రీ ఇచ్చారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. యాక్సియం-4 మెషిన్ ద్వారా ఇది సాధ్యం అయింది. 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది.
రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయుడిగా నిలిచారు శుభాంశు. మరో ముగ్గురు సహచర అస్ట్రోనాట్స్ మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్‌స్కీ విస్నియెవ్‌స్కీ , టైబర్ కపుతో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లారు.
శుక్లా బృందం 14 రోజుల పాటు కీలక ప్రయోగాలు చేయనుంది. భార రహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగ నిరోధక వ్యవస్థ వంటి అంశాలపై పరిశోధలను చేస్తారు. ఇస్రో తరఫున శుభాంశు 7 ఎక్స్‌పరిమెంట్స్ చేస్తారు. వీటితో పాటు నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ శుక్లా పార్టిసిపేట్ అవుతారు. మొత్తంగా యాక్సియం-4 మిషన్‌లో ఉన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్‌లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.
భారత్ తరపున స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఆస్ట్రోనాట్ రాకేశ్ శర్మ. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన 7 రోజుల 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఇప్పుడు దీనికి రెట్టింపు రోజులు శుక్లా స్పేస్‌లో ఉండనున్నారు.
At 8:14am ET on Thursday, the hatch opened between the @SpaceX Dragon spacecraft and the International Space Station and the Ax-4 crew from @Axiom_Space crew entered. More… https://t.co/3pFFP6VbPO pic.twitter.com/k6GWzj0Oav
— International Space Station (@Space_Station) June 26, 2025