Big Stories

Venezuela:ఫ్లైట్ కు తప్పిన ప్రమాదం, కానీ..స్లైడ్ ద్వారా దిగుతూ..

Venezuela news today(Current news in World): వెనుజులాలో లేజర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. వెనుజులాలో విమాన ప్రయాణికులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఫ్లైట్ లో ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటకు దిగేందుకు ప్రయత్నించే సమయంలో పలువురు గాయపడ్డారు.

- Advertisement -

లేజర్ ఎయిర్ లైన్స్ విమానం వెనుజులా నుంచి డిమినికన్ రిపబ్లిక్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఫ్లైట్ ప్రారంభమైన సమయంలో అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. ఆ సమయంలో ఫ్లైట్ లో  91 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. విమానం ఖాళీ చేయాలని అనౌన్స్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యవసర స్లైడ్ ద్వారా బయటపడేందుకు ప్రయత్నించారు. అందరూ ఒకే సారి స్లైడ్ వద్దకు పరుగులు తీసారు. స్లైడ్ ద్వారా క్రిందకు జారే సమయంలో పలువురు గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Also Read: లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి

వెనుజులాలోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్టు సిబ్బంది గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఫ్లైట్ శాంటో డొమింగోకు బయలుదేరింది. ప్రమాదానికి గల కారణాలు  ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News