BigTV English

US Open 2024: యూఎస్ ఓపెన్‌లో.. టైటిల్ గెలిచిన బెలారస్ భామ

US Open 2024: యూఎస్ ఓపెన్‌లో.. టైటిల్ గెలిచిన బెలారస్ భామ

US Open 2024 Aryna Sabalenka Wins Her Third Grand Slam Title: ఏదైనా లైఫ్ లో సింగిల్ గా విజయం సాధిస్తే.. ఆ వచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. మరి యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తొలిసారి గెలిస్తే ఎలా ఉంటది. ఆ రేంజ్ లోనే ఉంటది. హోరాహోరీగా సాగిన తుది పోరులో  బెలారస్‌ భామ అర్యానా సబలెంక ఘన విజయం సాధించి, టైటిల్ సొంతం చేసుకుంది.


మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సబలెంక 7-5, 7-5తో జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించింది. ఒక గంటా 53 నిమిషాలసేపు నువ్వా? నేనా? అన్నట్టు సాగిన పోరులో జెస్సికా కూడా పట్టువదలకుండా పోరాడింది. దీంతో విజయం ఇద్దరి మధ్యా దోబుచులాడుతూ వెళ్లింది. అటు ఒకసారి, ఇటొకసారి అన్నట్టు సాగింది. మొత్తానికి అద్భుతమైన ఫామ్ లో ఉన్న సబలెంక ఒత్తిడి తట్టుకొని హార్డ్‌కోర్ట్‌ క్వీన్‌గా నిలిచింది.

ఇటీవల టెన్నీస్ ప్రపంచంలో నూతన తారగా సెబలంక మిలమిలమని మెరుస్తూ వస్తోంది. నిజానికి 2021 యూఎస్ ఓపెన్ లో సెమీస్ వరకు వెళ్లింది. తర్వాత ఏడాది 2022లో తొలి నాలుగు దశల్లోనే వెనుతిరిగింది. అయితే 2023లోనే టైటిల్ గెలవాలి. కానీ ఫైనల్ లో కొకో గాఫ్‌ చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచింది.


2024లో ఈసారి మళ్లీ ఆ తప్పులు చేయకుండా, పట్టు వదలకుండా ఆఖరి క్షణం వరకు పోరాడి, కోర్టులో చిరుతలా పరుగెత్తి, పరుగెత్తి టైటిల్ సాధించింది.

Also Read: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్

ఒత్తిడిలో సబలెంక ఎక్కువ తప్పిదాలు చేసినా…మళ్లీ తప్పు తెలుసుకుని, రెట్టించిన శక్తితో పోరాడింది. అంతేకాదు తన బలమైన సర్వీసులతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ శక్తి ముందు జెస్సీకా నిలువ లేకపోయింది.

అంతేకాదు 40 విన్నర్లు కొట్టింది. 6 ఏస్ లు సాధించింది. అలా ఎట్టకేలకు సబలెంక తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి ఎగిరి గంతులేసింది. నాలుగేళ్ల దండయాత్రకు ముగింపు పలికింది.

ఒక దశలో జెస్సీకా ముందడుగు వేసింది. 5-3తో సెట్ గెలిచేలా కనిపించింది. కానీ నిలబెట్టుకోలేక వెనుకపడిపోయింది. మొత్తం గేమ్ లో 4 డబుల్ ఫాల్ట్ లు చేసింది. 22 అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×