South Korea Plane Crash: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ముయాన్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పింది. ఈ క్రమంలో ఎదురుగా ఉండే ఓ గోడను ఢీకొని పేలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం బ్యాంకాక్ నుంచి ముయూన్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది క్షణాల్లో అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండింగ్ గేర్‌పై పక్షి పడిందని, దాని కారణంగా ఘటన చోటు చేసుకున్నట్లు దక్షిణ కొరియా స్థానిక వార్తా సంస్థలు చెబుతున్నాయి.
కాకపోతే ఫుటేజ్‌లో మాత్రం టేకాఫ్ కాకుండా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెస్క్యూ అధికారులు అక్కడికి చేరుకుని విమానం వెనుక భాగం నుంచి ప్రయాణికులను కిందికి దించారు.
ALSO READ: టిక్‌టాక్ నిషేధంపై మాట మార్చిన ట్రంప్.. చట్టంపై స్టే విధించాలని పిటీషన్
దాదాపు గంట తర్వాత మంటలను అదుపులోకి తెచ్చామని స్థానిక అగ్నిమాపక అధికారులు, రెస్క్యూ టీమ్‌లు చెబుతున్నాయి. అయితే మృతుల సంఖ్య ఇంకా స్పష్టత రావాల్సివుంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రాజధాని సియోల్‌కు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగేశాయి. కాసేపట్లో ఘటనపై ప్రభుత్వం ఏ ప్రకటన చేయనుంది.
— Mrgunsngear (@Mrgunsngear) December 29, 2024