Australia vs India, 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో ( Border-Gavaskar Trophy 2024-25 ) భాగంగా… జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో టీమిండియా ( Team India ) ఆల్ అవుట్ అయింది. మూడవ రోజున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియ ఆటగాళ్లు… నాలుగవ రోజున ఉదయం కొత్త బంతిని ఆడే క్రమంలో తడబడ్డారు. దీంతో 369 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ ముగించేసింది టీమిండియా జట్టు. నాలుగో రోజు ఒక వికెట్ చేతిలో ఉన్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy)… చాలా హిట్టింగ్ ఆడాడు.
Also Read: Nitish Reddy: నితీష్ కుమార్ స్వాగ్.. హాఫ్ సెంచరీతో పుష్ప, సెంచరీతో సలార్!
ఫాస్ట్ గా ఆడే క్రమంలో… నిన్నటి సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) వికెట్ పడిపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ లైన్ బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) అవుట్ కావడం జరిగింది. ఇక నితీష్ కుమార్ ( Nitish Kumar Reddy) వికెట్ పడిపోయే సమయానికి… అతను 114 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 189 బంతుల్లో.. 11 ఫోర్లు ఒక సిక్స్ బాదిన నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో 369 పరుగులకు టీమిండియా ప్యాకప్ అయింది.
నితీష్ కుమార్ రెడ్డితో ( Nitish Kumar Reddy) బ్యాటింగ్ చేసిన సిరాజు ( Siraj) నాలుగు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్లలో… అందరూ ఫాస్ట్ బౌలర్లకు వికెట్లు పడ్డాయి. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఇవాల్టి మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా పడలేదు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ బౌలింగ్ లో మూడు వికెట్లు పడ్డాయి. బోల్యాండ్ మూడు వికెట్లు, స్పిన్నర్ లైన్ మూడు వికెట్లు పడగొట్టి రాణించారు. ఇక యశస్వి జైస్వాల్ రన్ అవుట్ సంగతి తెలిసిందే.
టీమిండియా ఆల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో… ఆస్ట్రేలియా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో ఆడిన ప్రభావం రెండవ చూపించడం లేదు ఆస్ట్రేలియా. ఇప్పటి వరకు 25 ఓవర్లు వాడిన ఆస్ట్రేలియా… 53 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్ హీరో సామ్ కాన్స్టాస్… తొందరగానే అవుట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేసిన ఇతను… రెండవ ఇన్నింగ్స్ లో 8 పరుగులకే అవుట్ అయ్యాడు.
అయితే మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )ను ఒక ఆట ఆడుకున్నాడు సామ్ కాన్స్టాస్ ( Sam Konstas ). కానీ రెండవ ఇన్నింగ్స్ వచ్చేసరికి అతనిపై జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) రివెంజ్ తీర్చుకోవడం జరిగింది. 8 పరుగులు చేసిన సామ్ కాన్స్టాస్ ను జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )… తన అద్భుతమైన బౌలింగ్ తో వికెట్ పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే.. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్… 19 కుర్రాడి పైన రివెంజ్ తీసుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Nitish Kumar Reddy Family: నితీష్ ఈజ్ ఛాంపియన్… ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు ?
Konstas Kid, never mess with Bumrah.
What a celebration. 🤣🤣#INDvAUS #INDvsAUS #ViratKohli #JaspritBumrah
— Aaditya (@memalvanimanus) December 29, 2024