BigTV English

Elections Notification : లోక్ సభ ఎన్నికలు.. మూడోదశ నోటిఫికేషన్ విడుదల

Elections Notification : లోక్ సభ ఎన్నికలు.. మూడోదశ నోటిఫికేషన్ విడుదల

Lok sabha election 2024 updates(Latest political news in India): దేశమంతా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దశల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ.. తాజాగా మూడో దశ లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 7వ తేదీన జరిగే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 94 లోక్ సభ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.


అస్సాం-4, బీహార్-5, ఛత్తీస్ గఢ్-7, దాద్రానగర్ హవేలి-2, డామన్ డయ్యు-2, గుజరాత్-14, గోవా-2, జమ్మూకాశ్మీర్-1, కర్ణాటక-14, మహారాష్ట్ర-11, మధ్యప్రదేశ్-8, పశ్చిమబెంగాల్-4 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 12న నామినేషన్ల ప్రక్రియ మొదలై ఏప్రిల్ 19న ముగుస్తుంది. 20న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది.

Also Read : కోయంబత్తూరులో నారా లోకేష్, అక్కడ వన్ సైడ్ ఎలక్షన్..!


లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏప్రిల్ 17 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా.. అదేరోజున తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి నాలుగోదశలో జరుగుతాయి. మొత్తం ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. కాగా.. ఎన్నికల కోసం ఈసీ దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే 1.5 కోట్లమంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది ఎన్నికల కోసం పనిచేయనున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×