E-Paper
Advertisement

Spanish PM Called to Testify: అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ

Spanish PM Called to Testify: అవినీతి కేసులో ఏకంగా దేశ ప్రధానికే సమన్లు.. ప్రపంచ వ్యాప్తంగా చర్చ
Advertisement

Spanish PM called to Testify(Current news in World): అవినీతి కేసులో స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్ సతీమణిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆయనకు సమన్లు అందాయి. దీంతో ఆయన సాక్షం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం..

స్పెయిన్ ప్రధాని షాంచెజ్ సతీమణి బెగునా గోమెజ్‌పై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాను నడుపుతూన్న యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ కోర్సుకు స్పాన్సర్ల కోసం ప్రధాని సతీమణి హోదాను ఉపయోగించుకున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అక్కడి న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సాక్షిగా ప్రధాని షాంచెజ్‌ను ప్రశ్నించేందుకు విచారణాధికారులు ఆయనకు సమన్లు ఇచ్చారు. అధికారిక నివాసంలో జులై 30న ఆయనను కోర్టు ప్రశ్నించనున్నది. ఆయన సాక్ష్యం ఈ కేసుకు అత్యంత కీలకం కానున్నదంటూ అందులో పేర్కొన్నారు.

Advertisement

Also Read: ఉక్రెయిన్ యుద్ధ లక్ష్యాలు చేరుకోవడానికే మా ప్రాధాన్యం: రష్యా

అయితే, ఇటీవలే బెగునా విచారణకు హజరయ్యింది. కానీ, జడ్జి అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానం ఇవ్వలేదు. అదేవిధంగా తనపై వచ్చిన ఆరోపణలపై ఆమె ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, పెడ్రో మాత్రం విపక్షాల విమర్శలను ఖండిస్తున్నారు.

Advertisement

కాగా, ఈ ఆరోపణల నేపథ్యం షాంచెజ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని భావించారు. దీంతో తన విధుల నుంచి ఐదు రోజులపాటు బ్రేక్ తీసుకున్నారు. కానీ, ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×