BigTV English

Indian Students : చదువుల కోసం చలో కెనడా, అమెరికా..

Indian Students : చదువుల కోసం చలో కెనడా, అమెరికా..
Indian Students

Indian Students : భారతీయుల ఉన్నత చదువులకు చిరునామాగా కెనడా, అమెరికా దేశాలే ఇప్పటికీ అగ్రభాగాన ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాను తలదన్నిన బ్రిటన్ మూడో స్థానానికి ఎగబాకింది. భారతీయ విద్యార్థుల్లో మారుతున్న ఈ ధోరణికి ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్-2023 అద్దం పడుతోంది.


దౌత్యపరమైన వివాదాలు, ఆందోళనల ప్రభావం ఉన్నప్పటికీ భారతీయ విద్యార్థులు తమ తొలి ప్రాధాన్యం కెనడాకే ఇస్తుండటం విశేషం. అమెరికాను తమ ద్వితీయ ప్రత్యామ్నాయంగా వారు చూస్తున్నారు. ఉన్నత చదువులకు బెస్ట్ డెస్టినేషన్‌గా బ్రిటన్ వైపు భారతీయులు మొగ్గుచూపుతున్నట్టు నివేదిక వెల్లడించింది.

ఆస్ట్రేలియాను తలదన్ని బ్రిటన్ పై స్థానానికి ఎగబాకింది. బ్రిటన్ వెళ్లే భారత విద్యార్థులు ఏటికాయేడు పెరుగుతున్నారు. ఈ పెరుగుదల రేటు బ్రిటన్‌లో 49.6% కాగా.. కెనడాలో 46.8 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో కెనడా వైపు భారతీయ విద్యార్థులు తెగ మొగ్గు చూపారు. మూడు సంవత్సరాల పాటు కెనడాయే అగ్రభాగాన నిలిచింది.


2021లో మాత్రం అమెరికా లీడ్‌లో ఉండగా.. 2019 నుంచి 2021 వరకు ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు 3, 4 స్థానాల్లో ఉన్నాయి. 2022లో వరుసక్రమం మారిపోయింది. 2018 నుంచి కెనడా విద్యాసంస్థల్లో చేరిన భారతీయుల సంఖ్యలో 86% పెరుగుదల నమోదైంది. అయితే రానున్న సంవత్సరాల్లో కెనడా వైపు భారతీయుల చూపు సన్నగిల్లే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు గత ఐదేళ్లలో ఆస్ట్రేలియాపై మోజు తగ్గుతూ వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారత విద్యార్థులను ఆకట్టుకునే విషయంలో 2019 మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 2022 నాటికి నాలుగో స్థానానికి పడిపోయింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×