BigTV English

Sunita Williams: అంతరిక్షంలో వినాయకుడి విగ్రహం, కుంభమేళా ఫొటో.. సునీత ఏం చేశారో తెలుసా?

Sunita Williams: అంతరిక్షంలో వినాయకుడి విగ్రహం, కుంభమేళా ఫొటో.. సునీత ఏం చేశారో తెలుసా?

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ రాకను అమెరికా ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటుందో అంతకు పదిరెట్లు ఎక్కువగా భారత్ కూడా సంబరాలు చేసుకుంది. సునీతా విలియమ్స్ భారత సంసతి మహిళ కావడం దీనికి ప్రధాన కారణం. అంతే కాదు.. ఆమె తన భారత మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. ఆ మాటకొస్తే భారతీయ సంస్కృతిని ఆమె ఇప్పటికీ గుర్తుంచుకున్నారు, ఆ సంస్కృతీ వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. తాజాగా సునీతా విలియమ్స్ దగ్గరి బంధువైన ఫల్గుని పాండ్యా ఇంటర్వ్యూ ఆ విషయాలను మరోసారి స్పష్టం చేసింది.


పొరుగు ఊరికి ప్రయాణం కట్టినా, లేక ఏదైనా కొత్త ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తున్నా మనకు అత్యవసరమైన, అత్యంత ఇష్టమైన వస్తువుల్ని వెంట తీసుకెళ్తాం. అలాంటిది అంతరిక్షంలోకి వెళ్తున్నప్పుడు సునీతా విలియమ్స్ తనతోపాటు ఏమేం తీసుకెళ్లారో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అవును, సునీతా విలియమ్స్ తనతోపాటు బుజ్జి వినాయకుడి విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లారట. ఆ విగ్రహం ఫొటోను కూడా ఆమె తనకి పంపించారని కజిన్ ఫల్గుని పాండ్యా చెబుతున్నారు. అంతరిక్ష కేంద్రంలో తాను ఉంటున్న ప్రదేశంలోనే ఆ విగ్రహాన్ని ఉంచుకున్నారని, తన యాత్ర మొత్తం ఆ విగ్రహంతోటే ఆమె ఉన్నారని ఫల్గుని చెబహుతున్నారు. 9 నెలలపాటు ఆ విగ్రహమే ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని అంటున్నారు ఫల్గుని. సహజంగా మనందరం విగ్రహాలను పీఠం పై పెట్టి పూజిస్తాం. ఇంకా పెద్ద విగ్రహాలను ప్రతిష్ట చేసి పూజిస్తాం. కానీ గాల్లో తేలుతున్న విగ్రహానికి పూజలు చేసిన ఘనత మాత్రం సునీతాకే దక్కుతుంది. అంతరిక్ష కేంద్రంలో వినాయక విగ్రహం జీరో గ్రావిటీ వల్ల గాల్లో తేలుతూ ఉంటుంది. ఆ విగ్రహాన్నే సునీతా విలియమ్స్ ప్రార్థించారు. గాల్లో తేలుతున్న వినాయక విగ్రహం ఫొటోలను కూడా ఫల్గుని బయటపెట్టారు.


ఇటీవల ఫల్గుని కుంభమేళాకోసం భారత్ కు వచ్చారు. ఆ సందర్భంగా తీసుకున్న ఫొటోలను ఆమె సునీతా విలియమ్స్ కి పంపించారు. అయితే అక్కడినుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అంతరిక్షం నుంచి కుంభమేళాకు సంబంధించిన కొన్ని ఫొటోలను సునీతా తనకు పంపించినట్టు ఫల్గుని చెప్పారు.

సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రావడాన్ని పురస్కరించుకుని న్యూజెర్సీలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఫల్గుని పాండ్యా తెలిపారు. ఆమె రాకకోసం తాము ఎంతగానో ఎదురు చూశామని, చివరకు తమ నిరీక్షణ ఫలించిందని ఆమె చెప్పారు. త్వరలో సునీతా విలియమ్స్ తో కలసి తాము భారత్ కి వస్తామంటున్నారామె. సునీతా తండ్రి స్వస్థలమైన గుజరాత్ రాష్ట్రంలోని ఝులసన్ తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని, తమ సొంత ప్రాంతాన్ని తాము తిరిగి చూడాలనుకుంటున్నామని ఫల్గుని చెప్పారు.

అఖండ దీపం..
సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొత్తేమీ కాకపోయినా.. ఈసారి ఆమె రాకపై అనేక అనుమానాలు ముసురుకోవడం విశేషం. 8 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి తిరిగి రావాల్సిన ఆమె 9 నెలలపాటు అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి రావాల్సిన వాహక నౌకలో ఇబ్బందులు తలెత్తడం, ఆ తర్వతా పలుమార్లు ఆమె ప్రయాణం వాయిదా పడటం సంచలనంగా మారింది. ఎట్టకేలకు ఆమె భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చారు. అయితే ఆమె రాకకోసం గుజరాత్ లోని ఝులసన్ గ్రామంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అఖండ జ్యోతిని వెలిగిస్తూ వచ్చారట గ్రామస్తులు. ఆ విషయాన్ని ఫల్గుని పాండ్యా తెలిపారు. ఆమె రాకకోసం అక్కడ నిత్యపూజలు జరిగాయంటున్నారు ఫల్గుని. సునీత భూమిపైకి సురక్షితంగా చేరుకున్న తర్వాత బాణసంచా కాల్చి గొప్ప ఊరేగింపు చేశారని, ఆమె ఫొటోని ఈ ఊరేగింపులో ప్రదర్శించారని చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×