Sunita williams terms space eager to vote from space in us elections: భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. 2006, 2012 లలో రెండు సార్లు అంతరిక్ష ప్రయాణం చేశారు. మొత్తం 322 రోజులు ఆమె అంతరిక్షంలోనే గడిపారు. అలాగే అక్కడ 50 గంటల నలభై నిమిషాలు స్సేస్ వాక్ చేసిన మహిళగా రికార్డులు క్రియేట్ చేశారు. గుజరాత్ మూవీలు ఉన్న సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి ఈ సంవత్సరం మే 5న అంతరిక్షానికి ప్రయాణం మొదలు పెట్టారు. సునీతా విలియమ్స్ తో పాటు విల్ మోర్ కూడా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వాస్తవానికి అంతరిక్షంలో ఇన్ని రోజులు గడపడం కష్టమే. బోయింగ్ స్టార్ లైనర్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. దాదాపు నాలుగు నెలల అనంతరం తాజాగా అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇక్కడినుంచే ఓటేస్తాం
త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సునీతా విలియమ్స్ మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని..త్వరలోనే వస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడుతూ తాను అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటానని అన్నారు. మేము ఇక్కడినుంచే ఓట్లేస్తామని అమెరికా ఎన్నికల అధికారులకు అభ్యర్థన పంపించాము. అమెరికా పౌరులుగా మేము ఓట్లేయాలని అనుకుంటున్నాము. ఓటు హక్కు మా బాధ్యత. మేము ఓటేసేందుకు నాసా సహకరిస్తుందని అనుకుంటున్నాము. అమెరికా నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని..అవకాశం కల్పిస్తే ఇక్కడినుంచే ఓటేస్తామని అన్నారు.
మరికొన్ని నెలలు అక్కడే
ప్రస్తుత పరిస్థితిలో మరొకొన్ని నెలలు అంతరిక్షంలోనే గడపాల్సి ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఉండటం ఆనందంగానే ఉంది. మా విధులు గుర్తొచ్చినప్పుడు అదేమీ పెద్ద విషయం కాదని అనిపిస్తోందన్నారు. వాస్తవానికి జూన్ 14నే సునీతా విలియమ్స్, విల్ మోర్ భూమిపైకి తిరుగు ప్రయాణం కావలసి ఉంది. స్తార్ లైనర్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యల వలన వీరి ప్రయాణం మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాది చివరకు గానీ వీరు తిరుగు ప్రయాణం చేసేందుకు వీలు కాదని నాసా చెబుతోంది.
VIDEO | Astronauts Sunita Williams (@Astro_Suni) and Butch Wilmore, who are stuck at the International Space Station, interact with the media from space.
"What we look forward to is being here and being part of the crew that's here. We have been part of expedition 71. They are a… pic.twitter.com/L20ntN8Hli
— Press Trust of India (@PTI_News) September 14, 2024