BigTV English
Advertisement

Taliban morality rules: అక్కడ గడ్డం గీసుకుంటే నేరం..జాబ్స్ పోతాయి ఏ దేశంలోనో తెలుసా?

Taliban morality rules: అక్కడ గడ్డం గీసుకుంటే నేరం..జాబ్స్ పోతాయి ఏ దేశంలోనో తెలుసా?

Taliban morality police dismissed over 280 men after they fail to grow beards: మన దేశంలో చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్లు నీట్ గా గడ్డం చేసుకుని , టక్ వేసుకుని ..టై పెట్టుకుని ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అనుభవాలు, సర్టిఫికెట్ల కన్నా అప్పియరెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొందరు యజమానులు. ఎక్కువ శాతం ఇంటర్వ్యూలలో పాల్గొనేవారు తమ గడ్డాలని నీట్ గా షేవ్ చేసుకుని వెళుతుంటారు. కానీ ఆ దేశంలో గడ్డాలు తీసేశారనే కారణంగా కొందరి ఉద్యోగాలను స్వయంగా అక్కడి ప్రభుత్వమే తొలగించింది. గుబురుగా గడ్డాలు పెంచుకోవాలని ఉద్యోగస్థులకు కీలక ఆదేశాలు కూడా ఇస్తోంది.


ఇస్లామిక్ ఆచారాలకు అనుగుణంగా..

పాకిస్తాన్ కు పొగుగు దేశమైనా ఆఫ్గనిస్తాన్ లో ఇలాంటి విచిత్రమైన రూల్స్ తో జనం తలలు పట్టుకుంటున్నారు. గడ్డం తీసేశారనే కారణంగా ఏకంగా రెండు వందల ఎనభై మంది భద్రతా సిబ్బందిని అక్కడి తాలిబాన్ ప్రభుత్వం తొలగించింది. తాలిబాన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గనిస్తాన్ లో ఇస్లామిక్ ఆచారాలను చాలా కఠినంగా అమలు పరుస్తుంటారు. ఇప్పటికే గడ్డం తీసుకోలేదని తొలగించిన ఉద్యోగాలతో అనేక మంది వీధిన పడ్డారు. ఇప్పుడున్న ఏ సిబ్బంది అయినా నిండుగా గడ్డం పెంచుకోవాలని..షేవ్ చేయడానికి ప్రయత్నిస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కఠినంగా చెబుతున్నారు.


మహిళలపై కఠిన నిబంధనలు

2020 దాకా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగిస్తున్న ఆఫ్గనిస్తాన్ 2021 సంవత్సరంలో తాలిబాన్ ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. అక్కడినుంచి వారికి స్వేచ్ఛ లేకుండా పోయింది. మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించాలని..అలాగే ఆడవారు ప్రాథమిక విద్యకే పరిమితంగా ఉండాలని సూచిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అక్కడ మీడియాపై ఆంక్షలు ఉన్నాయి. ప్రజలు స్వేచ్ఛగా తమ బావ ప్రకటన చేసేందుకు వీలులేదు. మహిళలపై తాలిబాన్లు విధించిన కఠిన నిబంధనలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి.

ఖండించిన యుఎన్ఓ

అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి బాహాటంగా ఎన్నోసార్లు తాలిబాన్ల దురాగతాలను ఎండగట్టాయి. ఇప్పటికీ అక్కడి నిబంధనలను వ్యతిరేకించిన వారిపై అనేక కేసులు పెట్టి జైళ్లలో ఉంచారు తాలిబాన్లు. గడ్డాల పెంపుపై విధించిన ఈ కఠిన నిబంధనలపై ఇప్పటికే అక్కడ ప్రజలు ఆగ్రహోదగ్దులవుతున్నారు. ఎవరి ఇష్టానికి తగ్గట్లుగా ఉండాలిగానీ ఇలాంటి విచిత్రమైన రూల్స్ ఏమిటి? అని తాలిబాన్ల ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటిదాకా గత సంవత్సరకాలంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా పదమూడు వేల మందికి పైగా ఆకారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×