Elon Musk : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా విభిన్న రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలు విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఈ విషయాల గురించి అందరికీ తెలుసు, కానీ.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. మస్క్ మిగతా వారికి భిన్నంగా ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కన్నారు. ఇప్పటి వరకు ఆయన పిల్లల సంఖ్య ఏకంగా 12 మంది. వీరిలో కొందరు కవలలు, టిపుల్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు మరోమారు ఎలాన్ మస్క్ ఇంకో బిడ్డకు జన్మనిచ్చారని అంటున్నారు. ఆష్లీ సెయింట్ క్లెయిర్ అనే ఓ రచయిత్రి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను, మస్క్ కలిసి ఐదు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఐతే.. మస్క్ ఈ విషయంపై చాలా రోజుల వరకు స్పందించని మస్క్.. భారీగా ఊహాగానాలు పెరిగిపోయిన తర్వాత స్పందించాడు.
సెయింట్ క్లెయిర్ ప్రకటన తర్వాత ఆమె ప్రతినిధి బ్రియాన్ గ్లిక్లిచ్ స్పందించారు. మస్క్, క్లెయిర్ మధ్య ఉన్న సంబంధాన్ని ధృవీకరించారు. రెండు పార్టీలు సహ-తల్లిదండ్రుల ఒప్పందంపై కుదుర్చుకున్నట్లుగా తెలిపారు. అయితే.. కొంతకాలంగా క్లెయిర్, ఆమె కుటుంబంపై ఓ రిపోర్టర్ కావాలని పదే, పదే వార్తలు రాస్తున్నారని తెలిపారు. అందుకే.. గోప్యంగా సాగాల్సిన ఈ ప్రక్రియ బయటకు వచ్చినట్లు తెలిపారు. అందుకే.. మస్క్ తన బిడ్డను బహిరంగంగా అంగీకరించాలని, బిడ్డ శ్రేయస్సు, భద్రత దృష్ట్యా వారి ఒప్పందాన్ని ఖరారు చేయాలని సెయింట్ క్లెయిర్ ఆశిస్తున్నట్లుగా.. ఆమె ప్రతినిధి వెల్లడించారు. సెయింట్ క్లెయిర్ ప్రకటన తర్వాత ఎలాన్ మస్క్ స్పందిస్తారని అంతా ఆశించారు. కానీ.. ఇంత వరకు ఎలాంటి స్పందన లేదు.
క్రమంగా వివాదం పక్కదారి పడుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ అనూహ్యంగా స్పందించారు. “Whoo” అంటూ ఒకే ఒక్క పదంతో రిప్లై ఇచ్చాడు. దాంతో.. మరిన్ని పుకార్లకు కారణమైంది. మీడియా ఒత్తిడి తర్వాతే తాను ఈ వార్తను ప్రజలకు తెలియజేసినట్లు క్లెయిర్ పేర్కొంది. బిడ్డ గోప్యత, భద్రతను కాపాడటానికి తాను గతంలో సాహసించలేదన్న క్లెయిర్.. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినట్లు తెలిపింది
మస్క్ కుటుంబం గురించి తెలుస్తా..
సెయింట్ క్లెయిర్ వాదన నిజమైతే.. ఆ బిడ్డ మస్క్ 13వ సంతానం అవుతుంది. టెస్లా,. స్పేస్‌ఎక్స్ CEO కి ఇప్పటికే ముగ్గురు మహిళలతో 12 మంది పిల్లలున్నారంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఎలాన్ మస్క్ తొలుత జస్టిన్ విల్సన్ అనే ఓ కెనడియన్ రచయిత్రిని పెళ్లి చేసుకున్నారు. 2000 -2008 వరకు వీరు కాపురం చేయగా, వీరికి ఐదుగురు సంతానం. వీరిలో మొదటి సంతానం అయిన నెవాడ అలెగ్జాండర్ మస్క్ (2002) 10 వారాల వయసులోనే చనిపోయాడు. తర్వాత కవలలు వివియన్, గ్రిఫిన్ జన్మించారు. వీరిలో వివియన్ ఆ తర్వాత తన జెండర్ మార్చుకుని తండ్రికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ జంటకు ఒకే కాన్పులో ట్రిప్లెట్స్ జన్మించారు. వారిలో కై, సాక్సన్ మస్క్, డామియన్ అనే పిల్లలున్నారు.
మధ్యలో తలులా రైలీ అనే బ్రిటిష్ నటిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు 2010–2012 వరకు కలిసుండి విడిపోయారు. మళ్లీ ఏడాదిలోనే అంటే 2013లో తిరిగి కలుసుకుని 2016లో మరోసారి విడిపోయారు. ఆ వెంటనే గ్రైమ్స్ అనే సంగీతకారిణి పెళ్లి చేసుకున్న ఎలాన్ మస్క్.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. X Æ A-ii (2020) – ఈ చిన్నారిని “X” అని పిలుస్తారు. ఆ తర్వాత ఎక్సా డార్క్ సిడరయేల్ (2021) – “Y” అని పిలుస్తారు, టెక్నో మెకానికస్ (Techno Mechanicus) – “టౌ” అంటుండే ముగ్గురికి జన్మనిచ్చారు.
Also read :
ఆ వెంటనే శివాన్ జిలిస్ (Shivon Zilis) అనే మహిళతో సంబంధం పెట్టుకున్న ఎలాన్ మస్క్.. 2021లో ట్విన్స్ కు జన్మనిచ్చారు. వారిలో స్ట్రైడర్ మస్క్, అజ్యూర్ మస్క్ కాగా.. వీరిద్దరి తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతుంటారు. కానీ.. వివరాలు బయటకు వెల్లడి కాలేదు. ఈ శివాన్ జిలిస్.. ఎలాన్ మస్క్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక న్యూరాలింక్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. మాములుగా అయితే.. మస్క్ తన పిల్లలను ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచుతారు. బయటకు కనిపించేలాగా చేయడం కానీ, వారిని మీడియాకు చూపించడం కానీ చేయరు. అయితే.. జనాభా తగ్గుదల గురించి ఆందోళనతోనే ఎక్కువ మంది పిల్లలను కనాలని కోరుకుంటున్నట్లు గతంలో ఓసారి చెప్పాడు.