US : అమెరికా ఉలిక్కి పడింది. టెర్రర్ ఎటాక్ జరిగినట్టు భద్రతాధికారులు ప్రకటించారు. కొలరాడోలోని బౌల్డర్‌లో జరిగిన ఇజ్రాయెల్ మద్దతుదారుల ర్యాలీపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫైర్ బాంబులు విసిరాడు. పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ కేకలు వేశాడు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
యూదులపై యాసిడ్ అటాక్
హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు సంఘీభావంగా కొలరాడోలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. అక్కడున్న యూదులపై మండే స్వభావం కలిగిన లిక్విడ్ ఉన్న గాజు సీసాలను విసిరాడు. ఆ సీసాలోని ద్రవం కారణంగా పలువురికి మంటలు అంటుకున్నాయి. ఆ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది.
ఉగ్రదాడిగా ప్రకటించిన FBI
దాడి చేశాక కూడా నిందితుడు అక్కడే ఉన్నాడు. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. ఇజ్రాయెల్ తీరుపై మండిపడ్డాడు. ఎటాక్ జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 45 ఏళ్ల మహమ్మద్ సబ్రీ సోలిమాగా గుర్తించారు. దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇది ఉగ్రదాడే అంటూ FBI డైరెక్టర్ కాష్ పటేల్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహమ్మద్ సబ్రీ సోలిమా వెనుక ఎవరున్నారు? ఏదైనా పెద్ద కుట్ర జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఉగ్రవాదం ఎక్కడున్నా..
హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సంఘీభావంగా ఆ ప్రాంతంలో వారానికి ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకునే సోలిమా ఈ దారుణానికి తెగబడినట్టు సమచారాం. దాడిని వైట్‌హౌజ్ ఖండించింది. టెర్రర్ అటాక్‌ను అధ్యక్షుడు ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదం గాజా సరిహద్దులోనే కాదు.. అమెరికా వీధులను కూడా తగలబెడుతోందని ఇజ్రాయెల్ రాయబారి అన్నారు.
Mohammad Soliman just lit a bunch of elderly Jews on fire in Colorado while shouting "Free Palestine"
Police: "Too early for a motive" pic.twitter.com/qElnrTTzwS
— End Wokeness (@EndWokeness) June 1, 2025