Kingdom Release : విజయ్ దేవరకొండ – నాగ వంశీ కాంబినేషన్లో ‘#VD12’ గా ‘కింగ్డమ్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఆల్రెడీ టీజర్ ను వదిలారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన దీనికి అనూహ్యంగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బజ్ పెరిగింది. అందువల్ల క్రేజీ బిజినెస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి నిర్మాతకి.
విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. పెద్ద క్యాస్టింగ్, పెద్ద స్కేల్.. ఇలా ఏ విషయంలోనూ నిర్మాత నాగవంశీ రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సత్య దేవ్ వంటి విలక్షణ నటులను కూడా భారీగా పారితోషికాలు ఇచ్చి ‘కింగ్డమ్’ కోసం తీసుకున్నారు.
ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అతనిది అని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. అలాగే రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు కూడా చిత్ర బృందం వెల్లడించింది. కానీ రెండో భాగంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించడం డౌట్ అని.. స్వయంగా అతనే ఓ ఆంగ్ల దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుపడం జరిగింది. సో 2వ భాగంలో హీరో ఎవరుంటారు అనే ఆసక్తి కూడా నెలకొంది.
‘కింగ్డమ్’ అనేది స్మాల్ సైజ్ కెజిఎఫ్ అని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఇందులో చాలా పాత్రలు ఉంటాయని.. రివ్యూయర్లు ఈ సినిమాలో ఎలాంటి లాజిక్స్ అయినా వెతకొచ్చు.. ఎలాంటి బొక్కలైనా చూపించొచ్చు.. అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు నాగవంశీ. సో అతని మాటల్ని బట్టి… ఇందులో ఉన్న క్యారెక్టర్ ఆర్క్స్ ను బట్టి.. ‘కింగ్డమ్ 2’ లో వేరే హీరో నటించే అవకాశాలు ఉండొచ్చు. కానీ తర్వాత కథ ముందుకు వెళ్లాలంటే విజయ్ దేవరకొండ పాత్ర కావాల్సిందే.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘కింగ్డమ్’ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొదట మార్చి 28 అనౌన్స్ చేశారు. తర్వాత మే 31 అయ్యింది. ఇప్పుడు జూలై 4 అని ప్రకటించారు. అయితే ఈ డేట్ కూడా డౌట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. ‘కింగ్డమ్’ సినిమాని ఇటీవల మళ్ళీ వేసుకుని చూశారట మేకర్స్. అయితే కొన్ని సన్నివేశాలకి రీ షూట్లు అవసరం దర్శకుడు గౌతమ్ భావించాడట. దీంతో కీలక సన్నివేశాలని మళ్ళీ రీషూట్ చేయడం మొదలుపెట్టారు. గోవాలో ‘కింగ్డమ్’ కి సంబంధించి కొన్ని సన్నివేశాలని రీ- షూట్ చేస్తున్నారు. ఇదంతా కంప్లీట్ అయ్యాక అనిరుథ్ .. ఆర్ ఆర్ మొదలుపెడతాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని జూలై 4 కి సినిమా రెడీ అయిపోతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.