BigTV English

Tesla India : భారత్‌లో టెస్లా కార్లు.. దేశంలో త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీ!

Tesla India : త్వరలోనే టెస్లా ఎలెక్ట్రిక్ కార్లు భారతదేశంలో రానున్నాయని బ్లూమ్‌బర్గ్ ఒక కథనం ప్రచురించింది. కథనం ప్రకారం.. భారత ప్రభుత్వం, టెస్లా మధ్య త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం జరిగితే 2024 సంవత్సరం నుంచి టెస్లా కార్లను భారత దేశంలో దిగుమతి చేసుకోవచ్చు. అలాగే మరో రెండేళ్లలో దేశంలోనే టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ స్థాపన కూడా జరుగుతుంది.

బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. జనవరి 2024లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టెస్లా ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ కోసం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీ స్థాపించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో ఎలెక్ట్రిక్ వాహనాల తయారీకి అనుకూలంగా ఉన్నాయి. కారణం ఆ రాష్ట్రాలలో ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ కోసం కావాల్సిన ఇకోసిస్టమ్(వాతావరణం) ముందుగానే ఉంది.

ఇందుకోసం టెస్లా కంపెనీ పెట్టుబడిలో భాగంగా మొదటి దశలో 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. అలాగే భారతదేశం నుంచి కొనుగోలుకు విడి భాగాల కోసం 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెంచే అవకాశం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు దృష్టిలో ఉంచుకొని కార్ల ధరను తక్కువ ఉంచేందుకు బ్యాటరీలను కూడా స్థానికంగా తయారు చేయాలని టెస్లా ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇంతకుముందు జూన్ 2023లో టెస్లా కంపెనీ సీఈఓ ఇలాన్ మస్క్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ యోచిస్తోందని చెప్పారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×