BigTV English
Advertisement

Viral News: 51 ఏళ్ల టీచరమ్మ ‘కామ’ పాఠాలు, బాలుడితో అలా చేస్తూ.. మరెక్కడా చోటు దొరకలేదా?

Viral News: 51 ఏళ్ల టీచరమ్మ ‘కామ’ పాఠాలు, బాలుడితో అలా చేస్తూ.. మరెక్కడా చోటు దొరకలేదా?

Texas Teacher News: గురు శిష్యుల బంధం చాలా గొప్పది. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను సన్మార్గంలో నడిపించేది టీచర్ మాత్రమే. విద్యాబుద్దుల నేర్పి పిల్లలను ప్రయోజకులు గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న టీచర్లు ఈ మధ్య దారి తప్పుతున్నారు. విద్యార్థులతోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్ లో ఓ విద్యార్థితో కామ కలాపాలు కొనసాగిస్తూ ఓ లేడీ టీచర్ అరెస్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది.


నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష

అక్టోబరు 3న టెక్సాస్‌ గార్డెన్ రిడ్జ్‌ లో  నిర్మాణంలో ఉన్న ఇంట్లో ఓ కుర్రాడు, ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు లోపల జరుగుతున్న విషయాన్ని చూసి షాక్ అయ్యారు. 51 ఏళ్ల జెన్నిఫర్ మాస్సే అనే టీచర్.. తన స్టూడెంట తో కలిసి రాసలీలలు కొనసాగిస్తూ కనిపించింది.  వెంటనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, విద్యార్థి వయసు ఎంత అనే విషయాలు బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థితో అక్రమ సంబంధం, సహా పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోమల్ కౌంటీ జైలుకు తరలించారు. నేరం రుజువైతే ఆమెకు గరిష్టంగా 20 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దానికి తోడుగా 10 వేల డాలర్లు(భారత కరెన్సీలో సుమారు  8 లక్షల 40 వేల రూపాయలు) జరిమానా విధించే అవకాశం ఉంది.


టీచర్ ను సస్పెండ్ చేసిన స్కూల్ యాజమాన్యం

టీచర్ జెన్నిఫర్ మాస్సే పై కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆమెను సెలవులో ఉంచినట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అనుచిత సంబంధాలను అస్సలు సహించమని తెలిపింది. విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని వెల్లడించింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జెన్నిఫర్ మాస్సే డావెన్‌ పోర్ట్ హైస్కూల్‌ లో ఆర్ట్ టీచర్ గా పని చేస్తున్నది.

అమెరికాలో పెరుగుతున్న అసహజ లైంగిక సంబంధాలు

గత కొంతకాలంగా అమెరికాలో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు పెరిగిపోతున్నాయి. తాజా నివేదిక ప్రకారం 2014 నుంచి 2019 మధ్యకాలంలో విద్యార్థులతో అసహ లైంగిక సంబంధాలకు సంబంధించి 500పైగా కేసులు నమోదయ్యాయి. గత నెలలో మిస్సౌరీలో 26 ఏళ్ల మ్యాథ్స్ టీచర్ 16 ఏళ్ల విద్యార్థితో లైంగిక చర్యలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. త్వరలోనే ఆయనకు న్యాయస్థానం శిక్ష విధించే అవకాశం ఉంది.  ఈ తరహా కేసుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి కేసుల విషయంలో న్యాయస్థానాలు సీరియస్ గా వ్యవహరించాలని కోరుతున్నారు. గురు శిష్యుల మధ్య సంబంధాలను కాపావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read Also: విమానం స్క్రీన్లలో ‘అలాంటి’ మూవీ, ప్రయాణీకులు షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Related News

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Big Stories

×