BigTV English

Passport Index : ఆ 6 దేశాల పాస్‌పోర్ట్ ఎంతో పవర్‌ఫుల్..

Passport Index : ఆ 6 దేశాల పాస్‌పోర్ట్ ఎంతో పవర్‌ఫుల్..
Powerful Passports In 6 Countries

Most Powerful Passports : తమ దేశాల పరిధిలో సంచరించినట్టుగానే వివిధ దేశాల మధ్య సులువుగా రాకపోకలు సాగించగలిగే అవకాశాలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగాయి. దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు.


2006లో పౌరులు ఎలాంటి వీసా లేకుండానే సగటున 58 దేశాలకు వెళ్లగలిగేవారు. ఇప్పుడా దేశాల సంఖ్య 111కి చేరింది. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్ ప్రజలకు నిరుడు మూడు కొత్త దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ లభించింది. ఆ దేశాలతో పాటు జపాన్, సింగపూర్ దేశాల పాస్‌పోర్టులు అత్యంత బలమైనవిగా నిలిచాయి.

ఆ ఆరు దేశాల పౌరులు వీసా రహితంగానే 194 దేశాలను సందర్శించే వీలుంది. ఈ విషయంలో గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్ ఫస్ట్‌ప్లేస్‌లోనే ఉండగా.. మిగిలిన నాలుగు యూరోపియన్ దేశాలు ఈ ఏడాది ర్యాంకింగ్‌ను పెంచుకుని అగ్రస్థానానికి చేరాయి.


Read More: గడ్డ కట్టిన సముద్రం.. నాసా అరుదైన ఫొటో..

బలమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాలుగా ఫిన్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ రెండో స్థానంలో నిలిచాయి. ఆ మూడు దేశాల పౌరులు 193 దేశాలకు వీసా-ఫ్రీ రాకపోకలు సాగించొచ్చు.

ఇక మూడోస్థానంలో ఉన్న ఆస్ట్రియా.. 192 దేశాలతో వీసా-ఫ్రీ ఎంట్రీ ఒప్పందాలు చేసుకుంది. పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో అమెరికాది ఏడో స్థానం.
పెట్టుబడులు, టూరిజాన్ని పెంచుకునే లక్ష్యంతో ఇండొనేసియా పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వీసా-ఫ్రీ యాక్సెస్ కోసం 20 దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇక మన ర్యాంకింగ్ విషయానికి వస్తే.. భారత పాస్‌పోర్ట్ 132వ స్థానంలో ఉంది. ఎలాంటి వీసా అవసరం లేకుండా భారతీయ పౌరులు ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వెళ్లొచ్చు.

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×