BigTV English

Georgia Mass Shooting : జార్జియాలో పేలిన తుపాకీ.. ముగ్గురి మృతి

Georgia Mass Shooting : జార్జియాలో పేలిన తుపాకీ.. ముగ్గురి మృతి
Georgia Mass Shooting

Georgia Mass Shooting : అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. జార్జియాలోని గ్వినెట్ కౌంటీలో సాయుధుడొకరు ముగ్గురిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో షూటర్ సహా ముగ్గురు మరణించారు. ఇంట్లోనే ఉన్న శిశువుకు మాత్రం షూటర్ ఎలాంటి హాని తలపెట్టలేదు.


మృతుల్లో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెకు ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. ఆమె, షూటర్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు, కాల్పులకు కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలో గన్ కల్చర్ ఏటా 40 వేల మందిని బలి తీసుకుంటోంది. సంపన్నదేశాల్లో కాల్పుల వల్ల మరణించేవారి సంఖ్య అత్యధికంగా ఉన్నది అమెరికాలోనే. తుపాకులు ఎక్కువగా ఉన్నది కూడా ఆ దేశంలోనే. ప్రతి వంద మంది అమెరికన్ల వద్ద 120.5 గన్స్ ఉన్నట్టు స్విస్‌కు చెందిన రిసెర్చి సంస్థ అంచనా వేసింది. 2011లో ఈ సంఖ్య 88 మాత్రమే.


యెమెన్‌లో ప్రతి వంద మందికి 52.8 తుపాకులు, సెర్బియా, మాంటెనెగ్రోలో 39.1, ఉరుగ్వే, కెనడా దేశాల్లో 34.7 తుపాకులు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులు గన్స్ కొనుగోలు చేయడమనేది గత కొన్నేళ్లుగా అగ్రరాజ్యంలో పెరుగుతోంది. 2019-21 మధ్య గన్ యజమానుల జాబితాలో కొత్తగా 75 లక్షల మంది చేరారు.

ఇక కాల్పుల కోసం ఏ ఏ తుపాకులు ఎక్కువగా వినియోగిస్తారు? అనే అంశంపై ఎఫ్‌బీఐ లెక్కలు సేకరించింది. హంతకులు ఎక్కువగా హ్యాండ్ గన్లపై ఆధారపడతారని తేలింది. 2020 నాటి గణాంకాల ప్రకారం 13,620 హత్యల్లో 59% హ్యాండ్ గన్ల సాయంతోనే చేశారు. అసాల్ట్ వెపన్స్ కేటగిరీలోకి వచ్చే రైఫిల్స్ వాడకమూ ఎక్కువే. ఇవి 3 శాతంగా ఉన్నట్టు ఎఫ్‌బీఐ వెల్లడించింది. షాట్‌గన్స్‌తో మరణాలు ఒక శాతంగా ఉన్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×