BigTV English

Top 10 Strong Currencies | టాప్ 10 కరెన్సీల జాబితా.. అట్టడగున అమెరికా డాలర్!

Top 10 Strong Currencies | ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి కరెన్సీ విలువ. ఒక దేశ ఆర్థిక ప్రాముఖ్యాన్నిదాని కరెన్సీ మారక విలువ సూచిస్తుంది. ఒక దేశ కరెన్సీ ఎంత బలంగా ఉంటే ఆ దేశంలో అంత స్థిరత్వం ఉన్నట్లు. దేశం ఆర్థికంగా బలంగా ఉంటే కరెన్సీ విలువ కూడా అంతగా బలపడుతూ ఉంటుంది.

Top 10 Strong Currencies | టాప్ 10 కరెన్సీల జాబితా.. అట్టడగున అమెరికా డాలర్!

Top 10 Strong Currencies | ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి కరెన్సీ విలువ. ఒక దేశ ఆర్థిక ప్రాముఖ్యాన్ని.. దాని కరెన్సీ మారక విలువ సూచిస్తుంది. ఒక దేశ కరెన్సీ ఎంత బలంగా ఉంటే ఆ దేశంలో అంత స్థిరత్వం ఉన్నట్లు. దేశం ఆర్థికంగా బలంగా ఉంటే కరెన్సీ విలువ కూడా అంతగా బలపడుతూ ఉంటుంది.


కరెన్సీ విలువ బలంగా ఉంటేనే విదేశీ పెట్టుబడులు దేశంలో వస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ వ్యాపారం సజావుగా సాగుతుంది. ఐక్య రాజ్య సమితి ప్రపంచంలోని 180 దేశాల కరెన్సీలకు గుర్తింపునిచ్చింది. కొన్ని కరెన్సీలు ప్రపంచంలో చాలా పాపులర్.. అంతమాత్రాన వాటి విలువ ఎక్కువ అని కాదు. వడ్డీ రేట్టు, ద్రవ్యోల్బణం, ప్రపంచ దేశాల మధ్య స్థిరత్వం, వాణిజ్యంలో డిమాండ్-సప్లై ఇలాంటి ప్యాక్టర్స్ కరెన్సీ విలువను నిర్ధారిస్తాయి.

తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ బినెనెస్ పత్రిక.. ప్రపంచంలోని పది బలమైన కరెన్సీల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో కువైట్ కరెన్సీ కువైతీ దినార్( 1 కువైట్ దినార్ విలువ రూ.270.23 లేదా 3.25 అమెరికన్ డాలర్లు) ఉండగా.. పదవ స్థానంలో అమెరికన్ డాలర్ ( 1 అమెరికన్ డాలర్ విలువ రూ.83.10) ఉంది.


ఫోర్బ్స్ టాప్ 10 కరెన్సీ జాబితా

1. కువైతీ దినార్ ( 1 కువైట్ దినార్ = రూ.270.23)
2. బహ్రెయిన్ దినార్ ( 1 బహ్రెయిన్ దినార్ = రూ.220.4)
3. ఒమాని రియాల్ ( 1 ఒమాని రియాల్ = రూ.215.84)
4. జోర్డానియన్ దినార్ ( 1 జోర్డానియన్ దినార్ = రూ.117.10)
5. జిబ్రాల్తార్ పౌండ్ ( 1 జిబ్రాల్తార్ పౌండ్ = రూ.105.52)
6. బ్రిటీష్ పౌండ్ ( 1 బ్రిటీష్ పౌండ్ = రూ.105.52)
7. కేమెన్ ఐలాండ్ డాలర్ ( 1 కేమెన్ ఐలాండ్ డాలర్ = రూ.99.76)
8. స్విస్ ఫ్రాంక్ ( 1 స్విస్ ఫ్రాంక్ = రూ.97.54)
9. యూరో ( 1 యూరో = రూ.90.80)
10. అమెరికన్ డాలర్ ( 1 అమెరికన్ డాలర్ = రూ. 83.10)

అయితే భారత రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌ ర్యాంకింగ్‌లో 15వ స్థానంలో ఉంది. ఒక ఇండియన్ రుపీ విలువ అమెరికన్ డాలర్ మారకంలో రూ.82.9గా ఉంది. ఈ జాబితా జనవరి 10, 2024 మార్కెట్ విలువ ఆధారంగా తయారు చేయబడింది.

    ప్రపంచంలోని కరెన్సీలలో కువైట్ దినార్ చాలా సంవత్సరాలుగా ప్రథమ స్థానంలోనే కొనసాగుతోంది. కువైట్‌లో ఆర్థిక స్థిరత్వమే దీనికి ప్రధాన కారణం. కువైట్ ప్రధాన ఆదాయం చమురు అమ్మకాలు ద్వారా వస్తుంది. పైగా ఆ దేశంలో పన్నులు కూడా లేవు. కానీ ప్రపంచంలోని అత్యంత స్థిరమైన కరెన్సీ అంటే స్విస్ ఫ్రాంక్. స్విట్జర్ ల్యాండ్ కరెన్సీని స్విస్ ఫ్రాంక్ అంటారు.

    Related News

    Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

    Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

    Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

    Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

    Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

    US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

    H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

    Big Stories

    ×