E-Paper
Advertisement

Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి!

Train Accident: థాయ్‌లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి!
Advertisement

Train Accident: థాయ్‌లాండ్‌లో బుధవారం ఉదయం ఒక భయంకరమైన రైలు ప్రమాదం సంభవించింది. బ్యాంకాక్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరుగుతున్న హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి, సరిగ్గా అదే సమయంలో కింద నుంచి వెళ్తున్న ప్రయాణికుల రైలుపై పడింది.

ఈ ఊహించని ప్రమాదం కారణంగా రైలులోని బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా, కొన్ని చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసు తెలిపారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్స్, పోలీసులు అక్కడికి చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

Also Read: నందిగామలో దారుణం.. సొంత బిడ్డనే అమ్మకానికి పెట్టిన తల్లి.. సీన్ కట్ చేస్తే!

Advertisement

ప్రస్తుతం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హై స్పీడ్ రైలు నిర్మాణ పనుల్లో భద్రతా లోపాల వల్లే ఈ క్రేన్ పడిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×