Trump Ruling: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో కొందరు బెంబే లెత్తుతున్నారా? ఆయన రివేంజ్ తీర్చుకుంటున్నారా? కంపెనీలు, వలసవాదులు, ఇలా ఏ ఒక్కర్నీ వదల్లేదా? నాలుగేళ్లలో జరిగిన అరాచక వాదులను దూరంగా పెట్టాలని భావిస్తున్నారా? అవుననే అంటున్నారు సగటు అమెరికన్లు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పాలనపై దూకుడు పెంచారు. గత ప్రభుత్వం జారీ చేసిన పదుల సంఖ్యలోవున్న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకు చెక్ పెట్టారాయన. లేటెస్ట్‌గా మరో నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారందర్నీ సెలవులో ఉంచాలని ఆదేశిస్తూ వైట్‌హౌస్ ఓ మెమో జారీ చేసింది.
అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్ క్లూజన్ ప్రొగ్రామ్‌లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు ట్రంప్. బుధవారం సాయంత్రం లోగా వేతనంతో కూడిన సెలవుపై వారిని పంపాలని సంబంధింన ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. అంతేకాదు ఆయా విభాగాలకు చెందిన వెబ్ పేజీలను సైతం తొలగించారు.
డీఈఐ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను వెంటనే క్లోజ్ చేయాలని ఆయా ఏజెన్సీలకు సూచనలు వెళ్లాయి. ఆయా ఏజెన్సీలు గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని పేర్కొన్నాయి. సింపుల్ చెప్పాలంటే ఫెడరల్ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలన్నది ట్రంప్ సర్కార్ ఆలోచన. తాజా నిర్ణయం ఎంతమందిపై ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: అమెరికా జన్మతః పౌరసత్వం రద్దు.. చిక్కుల్లో ప్రవాస భారతీయులు
2023 ఆర్థిక లెక్కల ప్రకారం దాదాపు 20 ఏజెన్సీలు ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ వేలల్లో ఉద్యోగులను నియమించుకున్నారు. ఆయా ఉద్యోగులను గత ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు రిపబ్లికన్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారికి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.