BigTV English

Trump Assassination Attempt: హత్యాయత్నం తరువాత ట్రంప్ స్పందన.. షూటర్‌ని కాల్చివేసిన సీక్రెట్ సర్వీస్..!

Trump Assassination Attempt| అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. ఆయన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పరిసరాల్లో ఓ బిల్డింగ్ పై నుంచి ఓ షూటర్ ఆయనను తుపాకీతో కాల్చాడు.

Trump Assassination Attempt: హత్యాయత్నం తరువాత ట్రంప్ స్పందన.. షూటర్‌ని కాల్చివేసిన సీక్రెట్ సర్వీస్..!

Trump Assassination Attempt:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. ఆయన పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. పరిసరాల్లో ఓ బిల్డింగ్ పై నుంచి ఓ షూటర్ ఆయనను తుపాకీతో కాల్చాడు.


సాయంత్రం స్థానికి సమయం 6.15 గంటలకు జరిగిన ఈ ఘటనలో 78 ఏళ్ల ట్రంప్ కు బుల్లెట్ గాయమైంది. ట్రంప్ కుడి చెవిపై భాగానికి బుల్లెట్ గాయమైంది. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జనంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరికి గాయలయ్యాయి. ఈ ఘటన తరువాత ట్రంప్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.


హత్యాయత్నం తరువాత వెంటనే ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో ఆయన ఓ పోస్టు చేశారు. యు ఎస్ సీక్రెట్ సర్వీస్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఘటనలో చనిపోయిన వ్యక్తి, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ”ఇలాంటి ఘటన మన దేశంలో జరగడం చాలా దురదృష్టకరం. నాకు బుల్లెట్ శబ్దం వినిపించింది కానీ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే నా చెవి పై భాగానికి బుల్లెట్ తాకింది. చెవి నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది.” అని ఆయన పోస్టులో రాశారు.

Also Read: Meta Removes Restrictions: ట్రంప్‌కి శుభవార్త చెప్పిన మెటా..

ట్రంప్ హత్యాయత్నంపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధఇ ఆంథోనీ గుగీల్మీ మాట్లాడుతూ. “సాయంత్రం 6.15 గంటలకు పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న భవనంపై నుంచి ఓ షూటర్ కొన్ని బులెట్లు కాల్చాడు. మా సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోబోగా.. అతను దాడి చేశాడు. రక్షణ సిబ్బంది ఎన్ కౌంటర్‌లో ఆ షూటర్ మరణించాడు,”అని ప్రకటించారు.

మరో రెండు రోజుల తరువాత మిల్ వాకీ లో రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ ను పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారిక ప్రకటన జరుగనున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో హత్యాయత్నం ఘటన అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

https://twitter.com/hasibiro_maga/status/1812287147669635487

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×