BigTV English
Advertisement

Mustard oil For White Hair: ఈ ఒక్క నూనెతో తెల్ల జుట్టుకి ఇలా చెక్ పెట్టండి?

Mustard oil For White Hair: ఈ ఒక్క నూనెతో తెల్ల జుట్టుకి ఇలా చెక్ పెట్టండి?

Mustard oil For White Hair: మీరు తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత ప్రయత్నించిన జుట్టు నల్లగా మారడం లేదా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జీవితంలో తెల్లజుట్టు సమస్యలు రానే రావు.. ఇందుకోసం మస్టర్డ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. సాధారణంగా ఆవాల నూనె జుట్టు పెరుగుదలకు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మనందరికి తెలిసిందే.. అయితే తెల్లజుట్టును తొలగించేందుకు కూడా ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే అనేక పోషకాలు జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి. కాబట్టి ఆవాల నూనెలో కొన్ని పదార్ధాలను కలిపి జుట్టుకు అప్లై చేశారంటే వైట్ ఎయిర్‌కు గుడ్ బై చెప్పేయొచ్చు. హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


☀ కావాల్సిన పదార్ధాలు
⦿ ఆవాల నూనె
⦿ మెంతి పొడి టేబుల్ స్పూన్
⦿ ఉసిరి పొడి టేబుల్ స్పూన్
⦿ గోరింటాకు పొడి టేబుల్ స్పూన్

☀ తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కప్పు ఆవాల నూనె, మెంతి పొడి, ఉసిరి పొడి, గోరింటాకు పొడి వేసి, బాగా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వండి. ఇప్పుడు తలకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టు పెరుగుదలకు అద్బుతంగా పనిచేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇంట్లోనే నాచురల్‌‌గా తయారు చేసుకున్నారంటే.. తెల్లజుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు.


తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు ఆవాల నూనెతో  ఓసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు పది నిమిషాల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పదార్దాలతోనే ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

☀ కావాల్సిన పదార్ధాలు
⦿కరివేపాకు
⦿మెంతులు రెండు టీ స్పూన్‌లు
⦿లవంగాలు పది
⦿కలోంజీ సీడ్స్ రెండు టీ స్పూన్‌లు
⦿మిరియాలు 20

☀ తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి.. మందపాటి పాన్ పెట్టుకుని అందులో కరివేపాకు, మెంతులు, లవంగాలు, మిరియాలు, కలోంజీ సీడ్స్ వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మరొక గిన్నె పెట్టుకుని.. అందులో ఆవాల నూనె, తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి 10 నిమిషాలు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి.

Also Read: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

ఇప్పుడు ఈ ఆయిల్‌ను తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యండి. కొద్దిరోజుల పాటు ఈ పొడి నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాల్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, తెల్లజుట్టును మాయం చేసేందుకు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ హెయిర్ మాస్క్‌లు మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Kitchen tips: వంట చేస్తున్నప్పుడు కళాయి మూతపై నీరు ఎందుకు పోయాలి?

Chicken Korma: అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే చికెన్ కుర్మా, రెసిపీ ఇదిగో

Farmer’s Honor: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!

Tulsi Leaves: ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను నమిలితే.. ఏమవుతుంది ?

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Big Stories

×