BigTV English

America Immigrants : చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ అరెస్టులు.. అమెరికాలోని ఇండియన్లకు అరెస్ట్‌ల భయం..

America Immigrants : చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ అరెస్టులు.. అమెరికాలోని ఇండియన్లకు అరెస్ట్‌ల భయం..

America Immigrants : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై విరుచుకుపడుతున్నారు. సరైన ధృవపత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడిన, అక్కడ ఉంటున్న వారిని పట్టుకుని తిరిగి వారి దేశాలకు పంపించేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించడంతో పాటు వలసదారుల తరలింపునకు సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఎలాంటి కనికరం లేకుండా.. అక్రమంగా ఉంటున్న విదేశీలయులపై చర్యలు తీసుకుంటున్నారు.


అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే అక్రమ వలసలను దేశంలోని అనుమతించే పరిస్థితే లేదన్న కఠిన వైఖరితో… యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు.. ఆదివారం నాటికి 956 మందిని పట్టుకోగా, సోమవారం నాటికి 1,179 మందిని అరెస్ట్ చేశాయి. వీరిలో బ్రెజిల్‌ నుంచి ఎక్కువ అక్రమ వలస నమోదు కాగా.. వారిని వెనక్కి పంపే క్రమంలో సైన్యం తీవ్రంగా వ్యవహరించింది. అరెస్ట్ చేసిన వారందరి.. చేతులకు, కాళ్లకు బేడీలు వేసి విమానాల్లో తరలించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా ఆయా దేశాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాదు.. ఆమెరికా వినియోగిస్తున్న సైనిక విమానాల్లో కనీసం తాగునీరు అందించడం లేదని, ఏసీ సౌకర్యం కూడా లేకుండా రవాణా విమానాల్లో తరలిస్తున్నారని అరెస్టుకు గురైన వలసదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బ్రెజిల్ సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

ట్రంప్ చర్యలపై సరిహద్దు దేశాలతో పాటు దక్షిణ అమెరికా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే.. పేదరికం, నిరుద్యోగం సహా అనేక సమస్యలతో సతమతమవుతుండగా, వారికి వసతులు ఎక్కడి నుంచి కల్పించాలని వాపోతున్నాయి. ముఖ్యంగా మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, హోండూరస్, ఎల్‌సాల్వడార్‌, గ్వాటెమాలా వంటి దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ దేశాల్లో కొన్ని అక్రమ వలసదారులతో అమెరికా నుంచి వచ్చిన సైనిక విమానాలకు వారి దేశాల్లోకి అనుమతించేది లేదని ప్రకటించారు. కొన్ని తిప్పి పంపించాయి. 88 మందితో బ్రెజిల్‌లోని మానాస్‌ కు వచ్చిన ఓ విమానాన్ని.. ఆ దేశ అనుమతి నిరాకరించగా, మెక్సికో సైతం ఆయా సైనిక విమానాల్సి తిప్పి పంపింది. కానీ.. ఆంక్షల హెచ్చరికలు, టారిఫ్ లను భారీగా పెంచాల్సి ఉంటుందన్న ట్రంప్ యంత్రాంగం హెచ్చరికలతో వెనక్కి తగ్గని పరిస్థితి. ఇదే తీరుగా కొలంబియా సైతం ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు దడుసుకోక తప్పలేదు.


అక్రమ వలసదారుల్ని వెతికి పట్టుకునేందుకు ఆమెరికా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం ఇమ్మిగ్రంట్ సర్వీసెస్, హోంలాండ్‌ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ, డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్, టొబాకో, యాంటీ బాంబ్ అండ్ వెప్పన్స్.. ఇలా వేరువేరు డిపార్టుమెంట్లకు సంబంధించిన అధికారులు పని చేస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన వాళ్లు ఎక్కడెక్కడ పని చేస్తారో గుర్తించి.. ఆయా చోట్ల వారిని పనుల్లో ఉండగానే పట్టుకుపోతున్నారు.

Also Read : ట్రంప్ గెలిచిన మూడు నెలల తర్వాత పలకరించిన మోదీ.. వీరి మధ్య ఎలాంటి బంధముంది..

కాగా.. ట్రంప్ వ్యవహార శైలిపై దేశంలోనూ కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అందరినీ దేశం నుంచి తరిమేస్తే చాలా చోట్ల పని చేసేందుకు నిపుణులైన పనివాళ్లు లేకుండా పోతారని అంటున్నారు. అలాగే.. వారి తరలింపు విషయంలో మరీ అంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని.. వారికి కాస్త సమయం ఇచ్చి చూడాలంటూ సలహాలిస్తున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×