Trump In President Race : అమెరికా అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేయాలని చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. రిపబ్లిక్ పార్టీ తరపున 2024 అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అమెరికాను మళ్లీ గొప్పగా, అద్భుతంగా మార్చడానికి సంసిద్ధంగా ఉన్నానన్నారు ఆయన. రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లను ఓడిద్దామన్నారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను అని ట్రంప్ చెప్పారు. 2017లో రిపబ్లిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్.
డెమోక్రటిక్.. పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ఆయన విజయం సాధించారు. నాలుగేళ్ల పదవి బాధ్యత తర్వాత.. రెండోసారి అధ్యక్ష రేసులో నిలిచారు. కానీ రెండోసారి అధ్యక్షుడు కావాలన్న ట్రంప్ ఆశలపై.. అమెరికా ప్రజలు నీళ్లు చల్లారు. 2021లో జరిగిన యూఎస్ఏ అధ్యక్ష ఎన్నికల్లో.. జో బైెడెన్ చేతిలో ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు. 2024లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరి రెండోసారి ట్రంప్ గెలుస్తారో లేదో చూడాలి.