E-Paper
Advertisement

మంత్రగత్తె కావాలని కలలుగనే అమాయకపు అమ్మాయి… కట్ చేస్తే కేక పెట్టించే సీన్లు

మంత్రగత్తె కావాలని కలలుగనే అమాయకపు అమ్మాయి… కట్ చేస్తే కేక పెట్టించే సీన్లు
Advertisement

Adventure fantasy anime: ఎవరైనా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని కలలు కంటారు. అంతేగానీ మంత్రగత్తె కావాలని ఎవరు కోరుకుంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో హీరోయిన్ తప్ప. నిజానికి ఇది సినిమా కాదు సిరీస్. అది కూడా యానిమే. యానిమేషన్ అనగానే చిన్న పిల్లల బొమ్మలు అని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఈ సిరీస్ లో పెద్దలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటుంది. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ యానిమే సిరీస్ ‘విచ్ హాట్ అటెలియర్’ (Witch Hat Atelier). కామోమే షిరహామా రాసిన పాపులర్ మంగాను ఆధారంగా తెరకెక్కింది. బగ్ ఫిల్మ్స్ స్టూడియో అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించిన ఈ సిరీస్ లో స్టోరీ హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది.మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

మాయా ప్రపంచంలో ఒక సాధారణ అమ్మాయి ఎలా అసాధారణ మంత్రగత్తె అయింది అన్నది కథ. సిరీస్ లోని ఈ మాయా ప్రపంచంలో మ్యాజిక్ అనేది పుట్టుకతో వచ్చే శక్తి అని అందరూ నమ్ముతారు. కానీ ఒక అమ్మాయి ఆ నమ్మకాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ అమ్మాయి పేరే కోకో. ఆమె ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి. ఆ అమ్మాయికి మ్యాజిక్ అంటే ప్రాణం. కానీ ఆమె సాధారణ మనిషి కాబట్టి మంత్రాలు మ్యాజిక్కులు చేయలేదు.

Advertisement

ఒకరోజు ప్రముఖ మాంత్రికుడు కిఫ్రే ఆమె ఉంటున్న గ్రామానికి వస్తాడు. అతను రహస్యంగా మ్యాజిక్ చేస్తుండగా కోకో చూసేస్తుంది. అప్పుడు ఆమెకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. మ్యాజిక్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు. ప్రత్యేకమైన మ్యాజిక్ ఇంక్ (సిరా)తో సింబల్స్ గీయడం ద్వారా ఎవరైనా మ్యాజిక్ చేయవచ్చు అన్నదే ఆ సీక్రెట్. ఇంకేముంది కోకో తన చేతుల్లో ఉన్న మాయా పుస్తకం నుండి ఒక చిహ్నాన్ని గీసి ప్రయోగం చేస్తుంది.

కానీ అది ‘నిషేధించబడిన మ్యాజిక్’ అని ఆమెకు తెలియదు. ఆ ప్రయోగం వల్ల ఆమె తల్లి రాయిగా మారిపోతుంది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన కోకో ధైర్యం కూడగట్టుకుని, తన తల్లిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. ఈ నేపథ్యంలోన కిఫ్రే కోకోను తన రహస్య వర్క్‌షాప్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకు అగోట్, టెటియా, రిచే అనే ముగ్గురు తోటి విద్యార్థులు పరిచయమవుతారు. మొదట్లో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నా, క్రమంగా వారు ఒక కుటుంబంలా మారుతారు.

Advertisement

కోకో ఇక్కడ మ్యాజిక్ నిజమైన రూపాన్ని, దాని శక్తిని, పరిమితులను నేర్చుకుంటుంది. అయితే కోకోపై నిషేధిత మ్యాజిక్ చేయించినది ఎవరో కాదు, సమాజానికి వ్యతిరేకంగా పని చేసే ‘బ్రిమ్డ్ క్యాప్స్’ అనే క్రూరమైన మాంత్రికుల ముఠా. వారు కోకోను తమ స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తుంటారు. కిఫ్రే, ఒల్రుగ్గియోలు కలిసి కోకోను రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక ఆ పిల్ల నెమ్మదిగా ఒక నిజమైన మంత్రగత్తెగా ఎదుగుతుంది. మరి ఇక్కడి నుంచి కొకో ప్రయాణం ఎలా సాగింది ? తల్లిని అనుకున్నట్టే కాపాడుకోగలిగిందా ? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన ప్రమాదాలు ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిన స్టోరీ. ‘విచ్ హాట్ అటెలియర్’ Netflixలో అందుబాటులో ఉంది. సీజన్ 1 సూపర్ హిట్ అవ్వడంతో, సీజన్ 2 కూడా నిర్మాణంలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. యానిమే లవర్స్‌ తప్పకుండా చూడాల్సిన మాస్టర్‌పీస్ ఈ సిరీస్.

Read Also: మనుషుల్ని పిశాచాలుగా మార్చే వైరస్… కొరియన్ అపోకలిప్టిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

ఈ ఇంట్లోకి అమ్మాయి అడుగు పెడితే అంతే సంగతులు… కితకితలు పెట్టే మలయాళం ఫ్యామిలీ డ్రామా

టీనేజ్ నుంచే డేటింగ్ పిచ్చి… మనసుకు హత్తుకునే ఇంగ్షీషు మూవీ స్ట్రీమింగ్ తెలుగులో

కలల ప్రపంచంలో చిక్కుకుయే స్పేస్‌షిప్‌ ట్రావెలర్స్… కామెడీతో పాటు మైండ్ బెండయ్యే ట్విస్టులు

పర్ఫెక్ట్ మాస్క్ వెనకున్న డార్క్ సీక్రెట్… ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను గుర్తుచేసే అన్ ఫర్గెటబుల్ మాస్టర్ పీస్

సిటీ బ్లాస్ట్ ప్లాన్ ను ఆపడానికి పాస్ట్ లోకి… మిస్టీరియస్ మనిషి ఎంట్రీతో అడ్డం తిరిగే కథ

బతికుండగానే నరకయాతన… చావాలనుకునే వాళ్ళనే టార్గెట్ చేసి చంపే కిల్లర్

జాబ్ లేదు, లవ్ లేదు… ఫ్రెండ్షిప్ తో హార్ట్ ను టచ్ చేసే రోడ్ ట్రిప్

Big Stories

Advertisement
×