Trump’s victory: అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక కానున్నారు. గతంలో మాదిరిగా ట్రంప్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారా? ఎలన్ మస్క్, కాబోయే ఉపాధ్యక్షుడు డీజే వాన్స్ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయా? దీనివల్ల ఇండియన్స్‌కి లాభమా? నష్టమా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం అక్కడి ఇండియన్స్‌కే కాదు.. భారత్‌కు కీలకం. రిపబ్లికన్లు.. సెనేట్‌లో మెజారిటీని కలిగి ఉంది. ప్రతినిధుల సభలో మాంచి మెజార్టీ ఉంది. సొంతం గా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇక ట్రంప్ విజయంలో అమెరికా ఇండియన్స్ కీలక పాత్ర పోషించారు.
అమెరికా ఏది చేసినా మా దేశం ఫస్ట్ ఉండాలనేది వారి నినాదం. దానికే తొలుత ప్రయార్టీ ఇస్తారు. ఆ తర్వాత మిత్రుల వల్ల తమకు కలిగే లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. దాని ప్రకారం అడుగులు వేస్తారు. రిపబ్లికన్ అంటే కార్పొరేట్ పార్టీ చెబుతారు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చినవారు ఆ స్థాయి వ్యక్తులే ఉంటారు. పన్నుల విషయంలో మినహాయింపులు ఉంటాయి.
అమెరికా స్థిరపడిన భారతీయుల్లో చాలామంది బిజినెస్‌మేన్లు ఉన్నారు. ఈసారి ట్రంప్‌కు వారందరు అండగా నిలిచారు. ట్రంప్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు సంతతికి చెందిన వారిని మ్యారేజ్ చేసుకోవడంతో కొంత కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ALSO READ: ట్రంప్ – ఎలాన్ మస్క్.. వీరి స్నేహం వెనుక ఓ స్టోరీ..
ట్రంప్ సర్కార్‌లో కీలకమైన అంశం హెచ్ 1బీ వీసా. భారత్ నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలంటే హెచ్-1బీ వీసా కచ్చితంగా ఉండాల్సిందే. ఈ విధానాన్ని గతంలో ట్రంప్ వ్యతిరేకించారు. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులపై ఆధారపడే అమెరికా సంస్థలకు ఇదొక సవాల్ అని చెప్పవచ్చు. అలాంటి విధానం తీసుకొస్తే అక్కడి భారతీయులపై ప్రభావం చూపే అవకాశముంది.
ట్రంప్ ప్రచారంలో మరొక అంశం. ఎన్నికల ప్రచారంలో ట్రంప్, వాన్స్ ఒక అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. అమెరికాలో డిపెండెంట్లుగా ఉన్న పిల్లలకు ఆటోమ్యాటిక్ పౌరసత్వం రద్దు చేయడం. తాము గెలిస్తే ఫస్ట్ డే సంతకం చేస్తామన్నారు. అమెరికాలో స్థిరపడిన వారి పిల్లలకు ఆటోమ్యాటిక్ పౌరసత్వం లభించాలంటే వారి తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికా శాశ్వత నివాసి కావాల్సి ఉంది.
దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందితే భారతీయ దంపతుల పిల్లలు గ్రీన్ కార్డుకు అనర్హులుగా మారుతారు. 2022 లెక్కల ప్రకారం.. అమెరికా దాదాపు ఐదుశాతం మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 16 లక్షల మంది అమెరికాలో పుట్టినవారే.
ట్రంప్ పాలసీల్లో కీలకమైంది. అమెరికా-భారత్ సంబంధాలపై కీలక ప్రభావం చూపేవాటిలో ఎగుమతులు.. దిగుమతులు. గతంలో భారత్ లో విధించే పన్నుపై ట్రంప్ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారత్‌ను టారిఫ్ కింగ్‌గా వర్ణించారాయన. ఈ లెక్కన అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి తొలి ప్రయార్టీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇరుదేశాల మధ్య ప్రతిస్థంభనకు దారి తీయవచ్చని విదేశీ వ్యవహారాల నిపుణుల అంచనా.