BigTV English

Chinese killed: పాకిస్థాన్‌లో చైనీయులపై ఉగ్రదాడి.. చైనావాసులనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?

Chinese killed: పాకిస్థాన్‌లో చైనీయులపై ఉగ్రదాడి.. చైనావాసులనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు?

Why is China keen on investing in Pakistan: పాకిస్థాన్ లోని కరాచీ విమానాశ్రయం వద్ద ఆదివారం బాంబు పేలి ఇద్దరు చైనీయులు మృతిచెందారు. పలువురు పాకిస్థాన్ వాసులు కూడా గాయపడ్డారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రకటించింది.


శాంగై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీఓ) సమావేశాన్ని కరాచీలోనే రానున్న వారంరోజుల్లోనే నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది.

అయితే, ఇటువంటి దాడులు మొదటిసారి కాదు.. గతంలో కూడా జరిగాయి. బలోచ్ మిలిటెంట్స్ చైనా వాళ్లను టార్గెట్ చేసి వారిని హత్య చేస్తున్నారు. వారి పాకిస్థాన్ లో పెట్టుబడులు పెడుతున్నారనే ఆగ్రహంతో వారిని హత్య చేస్తున్నారంటా.


Also Read: ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్, ఇంతకీ ఎవరు వారు? ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలిస్తే షాకవుతారు

హత్యగావించబడ్డ చైనీలు పోర్ట్ కైజిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన వాహనంలో ప్రయాణిస్తుండగా అటాక్ జరిగింది. అయితే, ఈ కంపెనీ కరాచీ వద్ద ఉన్న రెండు కోల్ పవర ప్లాంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది.

ఈ ఘటనపై చైనా ఎంబసీ సీరియస్ అయ్యింది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చైనీయులు, పాకిస్థాన్ వాసుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వారి కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

ఈ సందర్భంగా పాకిస్థాన్ కు పలు సూచనలు చేసింది. ఈ దాడిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ రకంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ లో ఉన్న చైనీయులు, చైనా ప్రాజెక్టులు, ఇనిస్టిట్యూషన్స్ భద్రత విషయమై తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది.

పాకిస్థాన్ లో చైనీయులను ఎందుకు హత్య చేస్తున్నారంటే..?

చైనీయులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) అనే ఉగ్రవాద సంస్థ బలోచిస్తాన్ ను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. చైనాతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాక్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. పాక్ ప్రభుత్వంతో కలిసి చైనా బలూచిస్తాన్ లోని సహజ వనరులను దోపిడీ చేస్తుందని, దీంతో స్థానికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ సంస్థ ఆరోపిస్తుంది. చైనాతో లింక్ ఉన్న ప్రాజెక్టులపై వరుస దాడుల నేపథ్యంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Also Read: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

మరి పాకిస్థాన్ లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు చైనా ఎందుకు ఆసక్తి చూపుతోంది?

అయితే, ఇటువంటి వరుస దాడులు జరుగుతున్నా చైనా మాత్రం పాకిస్థాన్ లో ఎందుకు పెట్టుబడులు పెడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, చైనా దాని కారిడార్, వాణిజ్య సంబంధాలను పెంచేందుకు మరియు దక్షిణ ఆసియా అంతటా దాని ప్రభావాన్ని చూపేందుకు సహయపడుతుందనేది చైనా భావన అంటూ పలువురు అంటున్నారు.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×