planes collided: అమెరికాలోని ఓ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేసిన విమానం పైకి మరో విమానం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. అసలేం జరిగింది? దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఈ ఏడాదిలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చాలామంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అన్నట్టుగానే అహ్మదాబాద్ ఘటన జరిగింది. ఆ ఘటనలో దాదాపు 240 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. దాని తర్వాత చాలా విమానాలు పలు సమస్యలు ఎదుర్కొన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి కూడా.
తాజాగా అమెరికాలోని మోంటానాలోని విమానాశ్రయంలో టీబీఎం 700 టర్బోప్రాప్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే రన్‌వే చివర క్రాష్ కారణంగా అక్కడ పార్క్ చేసి ఉన్న విమానంపైకి మరో విమానం దూసుకెళ్లింది. దీంతో ఆ ఎయిర్‌పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. పరిస్థితి గమనించిన అందులోని పైలట్ సహా నలుగురు ప్రయాణికులు వెంటనే బయటపడ్డారు.
ప్రాణ నష్టం తప్పింది. వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు ఎయిర్‌పోర్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లగించింది. ప్రమాద సమయంలో పార్కింగ్‌లో ఉన్న విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. ఢీకొన్న తర్వాత చెలరేగి మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి.
ALSO READ: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ చెత్త వాగుడు
ఈ విమానాశ్రయం కాలిస్పెల్‌కు దక్షిణంగా ఉంది.2011లో నిర్మించబడిన ఈ విమానం FAA రికార్డుల ప్రకారం వాషింగ్టన్‌లోని పుల్‌మాన్‌కు చెందిన మీటర్ స్కై LLC యాజమాన్యానికి సంబంధించినది. ఈ ఘటన గురించి ఆ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Two planes collided at Kalispell City Airport in #US's #Montana on Aug 11, sparking a massive fire and thick smoke. One plane lost control while landing and hit a parked aircraft. Injuries reported, no fatalities. #planecrash pic.twitter.com/9zQbbfDvwb
— Shanghai Daily (@shanghaidaily) August 12, 2025