BigTV English

Haunted Place: ఖైరతాబాద్ లో ఆత్మలు, అక్కడ అడుగు పెట్టారో ప్రాణాలు పోయినట్టే!

Haunted Place: ఖైరతాబాద్ లో ఆత్మలు, అక్కడ అడుగు పెట్టారో ప్రాణాలు పోయినట్టే!

Khairtabad Haunted Place: ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, ఆత్మలు, అతీత శక్తుల గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దెయ్యాలు, ఆత్మలు లేవని కొంత మంది చెప్పినప్పటికీ, చాలా మంది ఉన్నాయని ఇప్పటికీ నమ్ముతున్నారు. అంతేకాదు, హైదరాబాద్ లోనూ ఇలాంటివి పలు ప్రదేశాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సైన్స్ కాలేజీలోని పాడుబడిన తారాపురి భవనంలో ఇప్పటికీ ఆత్మలు తిరుగుతున్నాయని చాలా మంది భావిస్తున్నారు.  ఒకప్పుడు సైన్స్ కాలేజీగా ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిన ఈ కాలేజీ ఇప్పుడు ఓ హాంటెడ్ ప్రదేశంగా మారిపోయింది. ఈ కాలేజీ గురించి స్థానికులు బోలెడు కథలు చెప్తుంటారు. ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా, చాలా మంది ఆత్మలు ఉన్నమాట వాస్తవం అని కుండబద్దలు కొడుతున్నారు. వింత శబ్దాలు, విరామం లేని ఆత్మలు, వివరించలేని దృశ్యాలు ఎన్నో ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఏంటీ ఖైరతాబాద్ తారాపురి భవనం కథ? ఎందుకు జనాలు దీన్ని చూస్తే భయపడుతారు? అనే విషయాలను తెలుసుకుందాం..


చీకటి గతం, వెంటాడే జ్ఞాపకాలు

ఖైరతాబాద్ సైన్స్ కళాశాల ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రముఖ కాలేజీ. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. కాలేజీకి చెందిన కొన్ని భవనాలు కూలిపోవడంతో ఆ కాలేజీని మూసివేసినట్లు స్థానికులు చెప్తుంటారు. ఆ భవనాల కూలిపోవడంతోనే అనేక ప్రచారాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు. స్థానికులు చెప్పే విషయాలను బట్టి ఆ కాలేజీ బయాలజీ ల్యాబ్ లో మానవ శవాలపై అనధికార ప్రయోగాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కాలేజీ మూసి వేసిన సమయంలో అక్కడ పలు మానవ మృతదేహాలను వదిలేసినట్లు చెప్తారు. ఆ శవాలలోని ఆత్మలు ఇప్పటికీ అందులోనే ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు.  ఈ వాదనలను అధికారిక రికార్డులు ఏవీ ధృవీకరించనప్పటికీ,  ప్రచారం అలాగే కొనసాగుతోంది. స్థానికంగా ఉండే ఉమర్ లాంటి వ్యక్తులు రాత్రిపూట తారాపురి భవనం నుంచి భయంకరమైన కేకలు, అరుపులు వినిపిస్తాయని వెప్పుకొచ్చాడు. ఇక విరిగిన కిటికీలు, శిథిలావస్థలో ఉన్న గోడలతో కళాశాల ఎంతో భయంకరంగా కనిపిస్తుందంటున్నారు. శిథిలాల లోపల కదులుతున్న అస్థిపంజరాలతో సహా మెరుపులు, దెయ్యాల దృశ్యాలను చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దృశ్యాల కారణంగా దీనిని అస్థిపంజరాల పరిశోధన ప్రయోగశాలగా పిలుస్తున్నారు.


సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి

ఖైరతాబాద్ సైన్స్ కాలేజీ మూతపడినప్పటికీ అక్కడ ఓ సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. కాలేజీ ప్రాంగణానికి రక్షణగా ఉండేవాడు. ఒక రాత్రి  కాలేజీలో నుంచి వచ్చే వింత శబ్దాలు విని ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు భవనంలోకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అతడు శవమై కనిపించాడు. అతడి మృతదేహాన్ని చూస్తే, భయంతో స్తంభించిపోయి ప్రాణాలు వదిలినట్లుగా కనిపించించింది. అతడి కళ్లు తెరవబడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనను గుర్తు చేస్తూ మాజీ గార్డు అయిన మొహమ్మద్ హఫీజ్.. దానిలోకి వెళ్లిన ఎవరైనా మళ్లీ ప్రాణాలతో బయటకు తిరిగి రాలేదని చెప్పాడు. సెక్యూరిటీ గార్డు మణానికి సంబంధించి కారణాలు తెలియకపోవడంతో ఆత్మల సంచారం గురించి మరిన్ని అనుమానాలు పెరిగాయి.  ఖైరతాబాద్ సైన్స్ కాలేజీ మాత్రమే కాదు, రామోజీ ఫిల్మ్ సిటీ, గోల్కొండ కోట సహా పలు ప్రాంతాల్లోనూ ఆత్మలు తిరిగే ప్రదేశాలు ఉన్నాయనే చర్చ చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు.

Read Also: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Related News

Viral Video: వరదలో పాము.. చేపను పట్టుకొని జంప్.. వీడియో చూసారా?

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

Indore Crime News: బ్రేకప్ చెప్పిందని బైక్‌తో ఢీ కొట్టిన యువకుడు, వీడియో వైరల్

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Big Stories

×