BigTV English

OTT Movie : స్కూల్ పిల్లలను వెంటాడి వేటాడి పగ తీర్చుకునే పిల్ల దెయ్యం… దమ్మున్న వాళ్ళు చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : స్కూల్ పిల్లలను వెంటాడి వేటాడి పగ తీర్చుకునే పిల్ల దెయ్యం… దమ్మున్న వాళ్ళు చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : హాలీవుడ్ నుంచి భయంకరమైన హారర్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. అయితే వీటిలో ఇండోనేషియా హారర్ సినిమాలు ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని భయపెడుతున్నాయి. చేతబడి లాంటి కంటెంట్ తో, క్షణక్షణం ఉత్కంఠంగా ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ స్టోరీ ఒక బోర్డింగ్ స్కూల్ చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక అమ్మాయి దెయ్యంగా మారి విధ్వంసం సృష్టిస్తుంది. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

హెర్లినా అనే యువతి ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌లో విద్యార్థినిగా చేరుతుంది. హెర్లినా మెతక స్వభావం కలిగిన మనిషి. తన సహవిద్యార్థులచే బెదిరింపులకు గురవుతూ ఉంటుంది. ఆమె అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిల పెట్టే టార్చర్ ను తట్టుకోలేక పోతుంది. ఒక రోజు హఠాత్తుగా ఆమె వింతగా ప్రవర్తిస్తూ, బిల్డింగ్ మీద నుంచి కింద పడి మరణిస్తుంది. ఆమె మరణ వార్తను తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతారు. వీళ్ళు ఒక షమన్ సహాయంతో హెర్లినా ఆత్మను తిరిగి ఆమె దేహంలోకి పంపిస్తారు. ఇక తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవడానికి, హెర్లినా స్కూల్ కి మళ్ళీ వెళ్తుంది.


అయితే చనిపోయిన అమ్మాయి ఎలా మళ్ళీ తిరిగి వచ్చిందని అందరూ హడాలిపోతారు. ఆమె మనీషా ? దెయ్యమా ? అనే సందేహంలో ఉంటారు. హెర్లినా తిరిగి వచ్చాక బోర్డింగ్ స్కూల్‌లో విచిత్రమైన సంఘటనలు ప్రారంభమవుతాయి. వీటివల్ల విద్యార్థులు భయంతో వణికిపోతుంటారు. బోర్డింగ్ స్కూల్‌లో హెర్లినా  కొంతమందికి నరకం చూపిస్తుంది. చివరికి  హెర్లినా తన పగ తీర్చుకుంటుందా ? బోర్డింగ్ స్కూల్‌లో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి ? హెర్లినా చనిపోవడానికి కారణం ఎవరు ? ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఇండోనేషియన్ హారర్  సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : తండ్రికే తెలియకుండా కొడుకుని పూడ్చిపెట్టే కిరాతకుడు ఈ పోలీస్… ఓటీటీని ఊపేసిన బెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

 

డైలీమోషన్ (Daiymotion) లో

ఈ ఇండోనేషియన్ హారర్ సినిమా పేరు ‘ముంకర్’ (Munkar). 2024 లో విడుదలైన ఈ సినిమాకి అంగీ ఉంబర దర్శకత్వం వహించారు. ఇందులో అధిస్టీ జారా, సఫీరా రతు సోఫ్యా, సాస్కియా చాడ్విక్, కనీషియా యూసుఫ్ వంటి నటులు నటించారు. ఈ స్టోరీ ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌లో జరిగే అసాధారణ సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. MD పిక్చర్స్, పిచ్‌హౌస్ ఫిల్మ్స్, ఉంబర బ్రదర్స్ ఫిల్మ్ కలసి దీనిని నిర్మించాయి. ఈ మూవీ డైలీమోషన్ (Daiymotion) లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఒంటరగా మాత్రం చూసే దైర్యం చేయకండి.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×