BigTV English

Terrorist attacks in Burkina Faso : జీహాదీల ఊచకోత..బుర్కినా ఫోసోలో 200 మంది మృతి

Terrorist attacks in Burkina Faso : జీహాదీల ఊచకోత..బుర్కినా ఫోసోలో 200 మంది మృతి

Up to 200 people killed in attack in central Burkina Faso by terrorists: ఆ దేశంలో జీహాదీలు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో రెండు వందలకు పైగా పౌరులు మృతి చెందారు. పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో దారుణమైన హింసాత్మక ఘటన జరిగింది. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అండదండలతో జమాత్ నుస్రత్ ఆల్ ఇస్తాం వాల్ ముస్లిమిన్ అనే టెర్రరిస్ట్ సంస్థ బుర్కినా ఫాసోలో జరిపిన కాల్పులకు రెండు వందల మంది పౌరులు బలయ్యారు. మరో 140 కి పైగా గాయాలపాలయ్యారు. ఆ దేశ భద్రతా దళాలు కూడా ఉన్నారు మృతులలో. స్థానిక గ్రామస్థుల సహాయంతో భద్రతా బలగాలు శత్రువులు తమ గ్రామానికి రాకుండా గ్రామం చుట్టూ కందకాలు తవ్వే పనిలో బిజీగా ఉండగా ఒక్కసారిగా జమాత్ సుస్రత్ ఆల్ ఇసలాం వాల్ ముస్లిమిన్ టెర్రరిస్టులు వీరిపై విరుచుకుపడ్డారు.


దాడులకు పాల్పడింది వారే

ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన కాల్పులలో చాలా మంది పౌరులు చెల్లాచెదురయ్యారు. తీవ్ర తొక్కిసలాట జరిగింది. కొందరు ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. కాగా ఈ దాడులకు పాల్పడింది తామేనని జమాత్ సుస్రత్ సంస్థ ప్రకటించడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శత్రువులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని వచ్చిన పక్కా సమాచారంతో ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. శత్రువులెవరూ లోపలకి రాకూడదనే ఉద్దేశంతో కందకాలు తవ్వ వలసిందిగా స్థానిక ప్రజల సహకారం కూడా తీసుకున్నారు. కందకాలు తవ్వే పనిలో నిమిగ్నమైన పౌరులపై అకారణంగా దుండగులు కాల్పులు జరిపారు.


మట్టుబెట్టి తీరతాం
ఈ దాడితో సాధారణ పౌరులు, సైనికులు కూడా చనిపోయారని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపై టెర్రరిస్ట్ లను ఊరికే వదిలే ప్రసక్తే లేదని..వారిని మట్టుబెట్టి తీరతామని రక్షణ మంత్రి తెలిపారు. వాస్తవానికి బుర్కినా ఫోసో దేశం సగభాగానికి పైగా అక్కడి భూభాగం ప్రభుత్వ నియంత్రణలో లేదు. దీనితో ఆ ప్రాంతంపై పట్టు కోసం ఆల్ ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్థలు తరచుగా హింసాత్మక చర్యలతో తమ ఉనికిని చాటుకుంటున్నారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×