BigTV English

United Airlines: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు ఏం చేశాడంటే..

United Airlines: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు ఏం చేశాడంటే..

United Airlines: విమానాల్లో కొందరు కేటుగాళ్లు చేసే పనులకు తోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల పట్ల, సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నించి వారిపై దాడికి దిగుతున్నారు. ఇటీవల ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రవిసర్జన చేశాడు. ఇటువంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక అమెరికాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు.


యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం లాస్‌ఏంజిల్స్ నుంచి బోస్టన్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరో 45 నిమిషాల్లో విమానం బోస్టన్‌లో ల్యాండ్ అవుతుందనగా.. కాక్‌పిట్‌లో అలారమ్ మోగింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ డోర్ అన్ లాక్ అయినట్లు గుర్తించి సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే వారు సరిచేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. అయితే ఆ డోర్ దగ్గర చాలా సేపు ఓ ప్రయాణికుడు ఉండడం గుర్తించిన సిబ్బంది అతడిని ప్రశ్నించారు.

దీంతో అతడు సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. వారిపై చేయి చేసుకొని పదునైన వస్తువుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే తోటి సిబ్బంది అడ్డుకున్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ ఘటనపై స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిందితుడు తమ విమానాల్లో భవిష్యత్తులో ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు వెల్లడించింది.

Tags

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×