Big Stories

Joe Biden: ‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మద్యానికి బానిసయ్యా’: జో బైడెన్

US President Joe Biden: గతంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనని వెంటాడేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. త్వరలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలు ప్రజలకు వెల్లడించారు.

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను తెలియజేశారు. తాను గతంలో మద్యానికి బానిసై.. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశారని షాకింగ్ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు.

- Advertisement -

1972లో జరిగిన కారు ప్రమాదంలో తన మొదటి భార్య, కుమార్తె చనిపోయారని తెలిపారు. వారు మరణించిన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానన్నారు. ఆ సమయంలో దిక్కుతోచక.. అంతవరకు అలవాటు లేని మద్యానికి కూడా బానిసైనట్లు వెల్లడించారు. దీంతో ఆ సమయంలో బ్రిడ్జి పైకి వెళ్లి దూకాలనే ఆలోచనలు కూడా తనని వెంటాడేవనే షాకింగ్ విషయాన్ని ఇంటర్య్వూలో తెలియజేశారు. అప్పుడు తన ఇద్దరి కూమారులు గుర్తుకు వచ్చి ఆగిపోయేవాడినన్నారు.

అయితే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే.. ఆత్యహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రమాదం తర్వాత కొంతకాలం తన ఇద్దరి పిల్లల్ని తాను ఒంటరిగానే చూసుకున్నానన్నారు.

తన భార్య చనిపోయిన కొంతకాలానికి.. జిల్ తో పరిచయం ఏర్పడిందన్నారు. కాగా, 1975లో తామిద్దరం కలుసుకున్నామని గుర్తు చేసుకున్నారు. అయితే అప్పుడు జో వయస్సు 33 సంవత్సరాలని తెలిపారు. ఒకారోజు తన సోదరుడు ఫోన్ చేసి.. జిల్ గురించి చెప్పి పరిచయం చేశాడని వెల్లడించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి.. 1977లో తాము పెళ్లి చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు.

Also Read: ఈ 20 ఏళ్లలో అన్నీ మారాయి.. ఆ ఒక్కటి తప్ప: సుందర్ పిచాయ్

అయితే ఇదే ఇంటర్వ్యూలో తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చకు సిద్ధంగా ఉన్నానని బైడెన్ తెలిపారు. అయితే బైడెన్ వ్యాఖ్యలపై ట్రంప్ వెంటనే స్పందించారు. తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమే అంటూ తెలియజేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఎప్పుడెప్పుడు చర్చ జరుగుతుందా అని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News