BigTV English

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

TikTok: ‘టిక్ టాక్’‌కు ఇక మూడింది, పిల్లలను అలా చేస్తోందంటూ అమెరికా మండిపాటు.. బ్యాన్ చేస్తారా?

TikTok – US: ప్రముఖ షార్ట్ ఫారమ్ వీడియో యాప్ టిక్ టాక్ (TikTok)కు పిల్లలు బానిసలుగా మారి, మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై అమెరికాలోని 20కి పైగా రాష్ట్రాలు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, కెంటుకీ, న్యూజెర్సీతో సహా అనేక రాష్ట్రాల నుండి అటార్నీ జనరల్స్ టిక్‌ టాక్‌పై దర్యాప్తు చేసి నివేదికలను ఆయా రాష్ట్రాల న్యాయస్థానాల్లో దాఖలు చేశాయి. టిక్ టాక్ కంటెంట్ కు పిల్లలు బానిసలుగా మారి మానసిక వైకల్యం పొందే అవకాశం ఉన్నట్లు తమ నివేదికలలో వెల్లడించాయి.


ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్న టిక్ టాక్

యువత ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కేవలం తమ ఆదాయం కోసం టిక్ టాక్ పక్కదారులు తొక్కుతుందని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అటార్నీ జనరల్ బ్రియాన్ స్క్వాల్బ్ వెల్లడించారు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలగనంత వరకు ఇబ్బంది లేదన్న ఆయన.. దేశానికి ఎంతో ముఖ్యమైన చిన్నారులు టిక్ టాక్ కు బానిసలుగా మారిపోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నట్లు వెల్లడించారు. అటు ఇప్పటికే అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించాలంటూ చట్టసభలు తీర్మానించిన నేపథ్యంలో ఈ కేసులు టిక్ టాక్ కు గట్టి ఎదురు దెబ్బగా మారనున్నాయి.


టిక్ టాక్ తో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు

TikTok ఉద్దేశపూర్వకంగా పిల్లలను వ్యవసనపరులుగు మార్చుతుందని న్యాయనిపుణులు వెల్లడించారు. యవతీ యువకులు ఎక్కువ సేపు చూసేలా చేసి ఆర్థికంగా లాభపడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పిల్లలు టిక్ టాక్ ను ఎక్కువగా చూడటం వల్ల ఆందోళన, డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియాతో పాటు దీర్ఘకాలిక మానసిక, శారీరక సమస్యలకు కారణం అవుతుందని తెలిపారు. అయితే, తమ యాప్ ను 13 ఏండ్లలోపు పిల్లలను సైన్ అప్ చేయడానికి అనుమతించదని టిక్ టాక్ వెల్లడించింది. అయినప్పటికీ, పిల్లలు ఆ పరిమితులను ఈజీగా బ్రేక్ చేస్తున్నారని అధికారులు తేల్చి చెప్పారు.

టిక్ టాక్ కు వ్యతిరేకంగా అమెరికా చట్టసభల తీర్మానం

అటు టిక్ టాక్ ను నిషేధించాలనే బిల్లుకు కొద్ది నెలల క్రితమే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.  టిక్ టాక్‌ ను చైనా మాతృ సంస్థ అయిన ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి ఉపసంహరించుకోవాలనే బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఒకవేళ చైనా కంపెనీతో సంబంధం తెంచుకోకపోత అమెరికాలో టిక్ టాక్‌ని నిషేధించాలని నిర్ణయించింది. టిక్ టాక్ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారిందని బైడెన్  ప్రభుత్వం ఆరోపించింది.

చైనా యాజమాన్యం తమ దేశ పౌరుల డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే చైనా సంస్థతో సంబంధం తెచ్చుకోవాలని అమెరికా టిక్ టాక్ ను హెచ్చరించింది. మరోవైపు ఈ బిల్లుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీసుకున్న నిర్ణయం బెదిరింపు చర్యగా అభిప్రాయపడింది. ఈ యాప్ కారణంగా అమెరికా భద్రతకు ఎలా ముప్పు ఏర్పడుతుందో చెప్పలేదని  వెల్లడించలేదని తెలిపింది. అమెరికాలో టిక్ టాక్ యాప్ కు 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అటు ఈ యాప్ ను భారత ప్రభుత్వం 2020లోనే నిషేధించింది.

Read Also:కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×