BigTV English

US Strikes Yemen Houthi Rebels: యెమెన్‌లో విధ్వంసం.. హౌతీ రెబెల్స్‌పై అమెరికా వైమానిక దాడులు.. 24 మంది మృతి..

US Strikes Yemen Houthi Rebels: యెమెన్‌లో విధ్వంసం.. హౌతీ రెబెల్స్‌పై అమెరికా వైమానిక దాడులు.. 24 మంది మృతి..

US Strikes Yemen Houthi Rebels| యెమెన్ దేశ రాజధాని సనాపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది మరణించారు. హౌతీలు బలంగా ఉన్న యెమెన్ రాజధాని సనాలో అమెరికా జరిపిన ఈ దాడుల్లో 13 మంది పౌరులు, మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. అమెరికా బాంబు దాడుల వల్ల సనా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భూకంపం వచ్చిందని భ్రమించి ఇళ్లు వదిలి పారిపోయారు.


అమెరికా దాడులను ఖండిస్తూ.. ట్రంప్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని.. హౌతీల రాజకీయ బ్యూరో ఆరోపించింది. ఈ దాడులకు సమాధానం చెప్పేందుకు యెమెన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని హౌతీలు హెచ్చరించారు. గత దశాబ్దం కాలంలో యెమెన్ లో జరిగిన అంతర్యుద్ధం తరువాత దేశంలోని ఎక్కువ భూభాగాన్ని హౌతీలు తమ అధీనంలోకి తీసుకున్నారు. 2023 అక్టోబర్ లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, హౌతీలు.. ఇజ్రాయెల్ తీరంలోని ఓడలపై దాడులు ప్రారంభించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి ఆటంకంగా మారింది. గాజాలో యుద్ధంపై పాలస్తీనియన్లకు సంఘీభావంతో ఈ దాడులు జరుపుతున్నట్టు హౌతీలు చెప్పుకుంటూ వచ్చారు. 2023 నుంచి హౌతీలు 174 సార్లు అమెరికా యుద్ధ నౌకలపై, 145 సార్లు వాణిజ్య నౌకలపై దాడులు చేసినట్లు సమాచారం.

Also Read: ఇండియాను ఫాలో అవుతున్న ట్రంప్.. అమెరికాలో వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు!


ట్రంప్ హెచ్చరిక: “మీ టైమ్ అయిపోయింది”
దాడులపై ట్రంప్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు ఇతర నౌకలు, విమానాలు, డ్రోన్లపై దాడులకు ప్రేరేపించే విధంగా నిరంతర ప్రచారాన్ని హౌతీ ఉగ్రవాదులు నిర్వహించారని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. “హౌతీల టైమ్ ముగిసిపోయింది. దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే” అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్విట్టర్ లో ట్రంప్ చేసిన ట్వీట్ లో.. “హౌతీ ఉగ్రవాదులందరికీ హెచ్చరిక. వారి సమయం ముగిసింది. ఈ రోజు నుంచీ మీ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కాదంటే గతంలో ఎన్నడూ చూడనంతగా నరకాన్ని చూస్తారు” అని రాశారు. అదే సమయంలో, ఇరాన్ ను కూడా ట్రంప్ హెచ్చరించారు. హౌతీలకు మద్దతు తక్షణం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు రోజుల క్రితమే హౌతీ ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యెమెన్ పై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు జిబౌటి ఓడరేవు నుండి బయలుదేరిన మూడు అమెరికన్ సైనిక సరఫరా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్ హౌతీ గ్రూప్ పేర్కొంది. హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా మాట్లాడుతూ.. రెండు అమెరికన్ డిస్ట్రాయర్లను కూడా తాము లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. మరోవైపు, యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ ఆర్థిక వనరులు, ఆయుధ మద్దతు, సైనిక శిక్షణను అందిస్తోందనే అమెరికా ఆరోపణలను ‘ఐక్యరాజ్యసమితి ఇరాన్ శాశ్వత మిషన్’ తోసిపుచ్చింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×