BigTV English

Black Coffee: బ్లాక్ కాఫీ తాగితే.. మతిపోయే లాభాలు తెలుసా ?

Black Coffee: బ్లాక్ కాఫీ తాగితే.. మతిపోయే లాభాలు తెలుసా ?

Black Coffee: బ్లాక్ కాఫీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో కూడా బ్లాక్ కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ కాఫీ శరీరంలో కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి, మీరు కాఫీని ఇష్టపడితే పాలు లేకుండా తాగడం అలవాటు చేసుకోండి.


బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీ కూడా బరువును సహజంగా, వేగంగా తగ్గించుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి

బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక కూడా బ్లాక్ కాఫీ ఆరోగ్యకరమైనదని పేర్కొంది.


బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదించిన ప్రకారం.. గ్రౌండ్ బీన్స్‌తో తయారు చేసిన ఒక కప్పు బ్లాక్ కాఫీలో కేవలం 2 కేలరీలు మాత్రమే ఉంటాయి. అయితే బ్లాక్ ఎస్ప్రెస్సో ఆ మొత్తాన్ని 1 కేలరీలకు తగ్గిస్తుంది. కాఫీని కెఫిన్ లేని బీన్స్‌తో తయారు చేస్తే.. అందులో కేలరీలు అస్సలు ఉండవు.

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం.. ప్రతిరోజూ 4 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీర కొవ్వు 4% తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం . ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు:
బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా డయాబెటిస్ ఉన్న వారు భోజనం తర్వాత బ్లాక్ కాఫీ తాగితే.. అది ఆహారం వెంటనే విచ్ఛిన్నం కాకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా గ్లూకోజ్ ఏర్పడే ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది. దీంతో పాటు.. ఇది కొత్త కొవ్వు కణాల ఏర్పాటును కూడా తగ్గిస్తుంది. క్లోరోజెనిక్ ఆమ్లం శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది . ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో.. బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది:
కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో సహజ ఉద్దీపనలా పనిచేస్తుంది. ఇది మెదడు , కేంద్ర నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అంతే కాకుండా ఇది దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. శరీరం యొక్క శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ, కొలెస్ట్రాల్ కు మేలు:
బ్లాక్ కాఫీ శరీరంలోని కొవ్వును తగ్గించంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది సిరల్లో పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. దీని కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి. అంతేకాకుండా.. ఇది కాలేయానికి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్, అదనపు లిపిడ్‌లను తగ్గించడం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తుంది .

Also Read: చాక్లెట్ ఫేస్ మాస్క్‌తో.. గ్లోయింగ్ స్కిన్

నీటి నిలుపుదల సమస్య :
బ్లాక్ కాఫీ శరీరంలో నీరు నిలుపుదల సమస్యను కూడా తొలగిస్తుంది. అంటే శరీరంలో వాపు వల్ల నీరు నిలుపుకోవడం జరిగితే బ్లాక్ కాఫీ ఈ సమస్య తగ్గడానికి సహాయపడుతుంది.

మూడ్ బూస్టర్:
బ్లాక్ కాఫీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మెదడు నుండి మంచి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చే.. తలనొప్పిని కూడా బ్లాక్ కాఫీ నయం చేస్తుంది.

Related News

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

High Protein Food: ఎగ్స్‌కు బదులుగా ఇవి తింటే.. ఫుల్ ప్రోటీన్

Eyesight: ఇలా చేస్తే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

Fatty Liver Food: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్

Masala Tea: ఒక కప్పు మసాలా టీతో.. ఇన్ని ప్రయోజనాలా ?

Cardamom Benefits:రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్కటి తింటే చాలు.. వ్యాధులు రమ్మన్నా రావు !

Big Stories

×