Houthis Attack US Warships : ఇరాన్ మద్ధతుతో మిడిల్ ఈస్ట్(Middel East) లో నిత్యం దాడులకు తెగబడుతున్న హూతీ తిరుగుబాటుదారులు( Houthi Rebals) .. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఎర్ర సముద్రంలో (Red Sea) ఇజ్రాయిల్ కు మద్ధతు తెలుపుతున్న దేశాలకు చెందిన వాణిజ్య, పౌర నౌకలపైనే దాడులు చేస్తూ వస్తున్న వీరు.. ఈ సారి ఏకంగా అమెరికా(America) యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఈ విషయాన్ని హూతీ నాయకులు ప్రకటించిన తర్వాత.. పెంటగాన్ సైతం ధృవీకరించింది. అయితే.. ఇందులో తమ నౌకలకు, సిబ్బందికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదని ఆమెరికా ప్రకటించింది.
అమెరికా యుద్ధ నౌకలే (War Ships) టార్గెట్ గా డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారు. తన ఆయుధ డిపోలోని నిల్వలపై అమెరికా విరుచుకుపడుతున్న తరుణంలో.. ఆమెరికా నౌకలపై ఎనిమిది వన్-వే అటాక్ అన్‌క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించారు. అత్యాధునిక ఆయుధాలతో నిత్యం యుద్ధానికి సిద్ధంగా ఉండే.. ఆమెరికన్ నేవీ.. ఈ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకుంది. హూతీ తిరుగుబాటుదారుల దాడిలో ఏ ఒక్క క్షిపణి కానీ, డ్రోన్ కానీ.. ఆమెరికా యుద్ధ నౌకల్ని సమీపించలేదని, వాటిని దారి మధ్యలోనే నాశనం చేసినట్లు పెంటగానే (Pentagon) అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని ఆమెరికా, దాని మిత్ర దేశాల నౌకల రక్షణ కోసం మోహరించిన యుద్ధ నౌకలు.. బాబ్ అల్ మందాబ్ జలసంధి (Bab al-Mandab Strait) గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు.
మరోవైపు.. హూతీ తిరిగుబాటుదారులు సైతం.. తాము యూఎస్ నేవీకి (US Nevy) వ్యతిరేకంగా 8 గంటల పాటు రెండు లక్షిత మిలిటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు ప్రకటించారు. వాటిలో మొదటిది.. అరేబియా సముద్రంలో ఉన్న అమెరికా విమాన వాహన నౌక (American aircraft carrier) అబ్రహం ను టార్గెట్ చేసుకుని క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా వెల్లడించారు. మరోదాడిలో ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు అమెరికన్ డిస్ట్రాయర్ లను లక్ష్యంగా చేసుకుని.. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లు ప్రయోగించామని ప్రకటించుకున్నారు. ఈ ఆపరేషన్లు విజయవంతంగా వాటి లక్ష్యాలను సాధించాయని తెలిపారు. కానీ.. ఆయా దాడుల్ని యూఎస్ నేవీ సమర్థవంతంగా అడ్డుకుందని పెంటగాన్ వెల్లడించింది.
గాజాపై ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ఎర్ర సముద్రంలో, ఏడెన్ గల్ఫ్‌లో ప్రయాణించే నౌకలపై హూతీల దాడులు ప్రారంభమయ్యాయి. వీరి దాడులతో అంతర్జాతీయ వాణిజ్యం అనేక సార్లు ఒడిదొడుకులకు లోనయ్యింది. దీంతో.. వీరిని నిలువరించేందుకు, ఆమెరికా సహా ఇతర ప్రాచ్యత దేశాలు ఈ ప్రాంతాల్లో యుద్ధ నౌకల్ని మోహరించాయి. అయినా.. వీరి ఆగడాలు ఆగగపోవడంతో బ్రిటన్ (Britan) తోడుగా తొలిసారి అమెరికా యుద్ధ విమానాలు హూతీలపై దాడులు చేశారు. అలా.. వీరి కార్యకలాపాలు చురుగ్గా ఉన్న ప్రతీసారి ఆమెరికా దాడులు చేస్తోంది. ఇటీవలే.. హూతీల ఆయుధ నిల్వలపై భారీగా దాడులు చేసిన ఆమెరికా.. భారీ నష్టాన్ని కలిగించింది.
యెమెన్ రాజధాని సనా (capital Sanaa) సహా.. పెద్ద ఎత్తున భూభాగాన్ని ఆక్రమించిన హూతీ తిరుగుబాటు దారులు.. అక్కడి నుంచి ఇజ్రాయిల్ పై దాడులకు దిగుతోంది. ఈ తిరుగుబాటు దళానికి ఇరాన్ గట్టి మద్ధతిస్తోంది. వీరితో పాటు హమాస్, హెజ్బొల్లాలకు ఇరాన్ మద్ధతు ఇస్తూ, ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు రెచ్చగొడుతోంది.