Uttarakhand Avalanche : ఉత్తరాకండ్ లోని ఛమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మంచు కొండలు విరిగిపడ్డాయి. అందులో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన దాదాపు 57 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారు. ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతం వద్ద.. మంచుచరియల్ని తొలగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికులపై.. ఒక్కసారిగా హిమపాతం విరుచుకుపడింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, బీఆర్ఓ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 33 మంది కార్మికులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరో 22 మంది కోసం గాలింపు చేపడుతున్నారు. నిన్న మంచు కొండలు విరిగిడటంతో ఈ ప్రమాదం జరిగింది. పనులు నిర్వర్తిస్తున్న కార్మికుల్లో 55 మంది అనూహ్యంగా వాటికింద చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పైనుంచి మంచుపెళ్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఉత్తరాఖండ్‌లో బద్రీనాథ్ సమీపంలో ఛమోలీ జిల్లా ఉంది. ఆ జిల్లాలో టిబెట్ సరిహద్దులోని మన దేశానికి చెందిన చివరి గ్రామంలో జాతీయ రహదారిపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో ఆ మంచును తొలగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దట్టమైన మంచు వర్షం, చిమ్మ చీకటితో సహాయక సిబ్బంది శుక్రవారం రాత్రి ముందుకు కదలేకపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో NDRF, SDRF ఉన్నాయి. సహాయక చర్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షలు జరిపారు. నిన్న కాపాడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
మానా గ్రామానికి సమీపంలో భారీ హిమపాతం వల్ల కార్మికులు చిక్కుకున్న సమయంలో వెంటనే సమాచారం అందిందని, ఐడీబీసీ, బీఆర్ఓ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్టు.. ఉత్తరాఖండ్ సీఎం సింగ్ ధామి తెలిపారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడాలని ఈ భగవంతుడిని కోరుకుంటున్న అని చెప్పారు.
Also Read: గాజా యుద్దం మళ్లీ ప్రారంభం.. ఒప్పందంపై ఇజ్రాయెల్ యూ టర్న్
కాగా.. బీఆర్ఓ వర్క్ సైట్‌ను మంచు కొండలు విరుచుకుపడడంతో.. ప్రమాదం జరిగినట్టు ఉత్తరాఖండ్ పోలీసు హెడ్ క్వార్టర్ ప్రతినిధి , ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే పేర్కొన్నారు. ఐదు అంబులెన్సులను ప్రమాద స్థలానికి పంపామని తెలిపారు. అక్కడ విపరీతంగా మంచు పడడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుందని బీఆర్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీనా తెలిపారు. ప్రతికూల పరిస్థితులను కూడా అధికమించి బాధితులను రక్షించేందుకు.. స్థానిక అధికారులు ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో వైపు ఇంకా మంచు కొండలు విరిగిపడడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Grateful to the #IndianArmy’s IBEX BRIGADE for their swift rescue efforts after the avalanche near Mana village, Garhwal. Their dedication amidst challenges is commendable. Our thoughts are with the families of those still trapped.
#Avalanche #Uttarakhand pic.twitter.com/5Su9B7dSKK
— Preeti Honagudi (Modi Ka Parivar) (@Preetihonagudi) February 28, 2025