BigTV English

Canada Hindu Attacks: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

Canada Hindu Attacks: కెనడాలో హిందు దేవాలయంపై దాడి.. భక్తులపై అటాక్ చేసిన సిక్కు కార్యకర్తలు

Canada Hindu Attacks| కెనడా దేశంలోని ఒక హిందూ దేవాలయంపై సిక్కు కార్యకర్తలు ఆదివారం సాయంత్రం దాడులు చేశారు. దేవాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా.. కొందరు ఖలిస్తాన్ సిక్కు కార్యకర్తలు గుడి గేట్లను కూలగొట్టి లోపలికి వచ్చారు. పూజలు చేస్తున్న భక్తులపై దాడి చేయగా.. గుడిలో నుంచి అందరూ పరుగులు తీరు. ఒంటారియో రాష్ట్రంలోని గ్రేటర్ టొరొంటో లో భాగమైన బ్రాంప్టన్ నగరంలో ఈ ఘటన జరిగింది. దాడుల్లో కొంతమందికి గాయాలయ్యాయని సమాచారం.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది గుడి గేట్లు బద్దలుకొట్టి భక్తులపై దాడులు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తరువాత బ్రాంప్టన్ హిందూ సభా టెంపుల్ లో భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. అయితే ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం ఆశ్చర్యకర విషయం. దీనిపై మీడియా పోలీసులను నిలదీయగా.. వారు జరిగిన హింస ఎవరు పాల్పడ్డారనే దానిపై స్పష్టత లేదని చెప్పారు.

Also Read: కెనెడా శత్రుదేశాల జాబితాలో ఇండియా.. అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు


కెనడా ఎంపీ చంద్ర ఆర్య సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. “కెనడాలో మత అతివాదం ఎంతగా పాతుకుపోయిందో, దాని వల్ల జరుగుతున్న హింసను ఎంత నిసిగ్గుగా కెనడా సమాజం స్వీకరిస్తోందో అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. కెనడాలోని హిందూ పౌరులు తమ భద్రత కోసం, తమ హక్కుల కోసం గొంతు ఎత్తాల్సిన సమయం ఇది. ఈ హింసకు రాజకీయ నాయకులను నిలదీయాల్సిందే. మత ఉన్మాదులు మన దేశ రాజకీయాలలో, పోలీసు ఏజెన్సీలలో పెద్ద పదవులే చేపట్టారు. వారే దీనంతటికీ కారణం.” అని ఘాటుగా తన ట్వీట్ లో వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చంద్ర ఆర్య.. ప్రధాన మంత్రి జస్టిన ట్రూడోకి చెందిన లిబరల్ పార్టీలో కీలక సభ్యుడు.

ఈ ఘటనపై బ్రాంప్టన్ నగర మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా హింసకు పాల్పపడిన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ట్విట్టర్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించడం కెనడాలో ప్రజలందరి హక్కు. అందరూ తమ ప్రార్థనా స్థలాల్లో తాము సురక్షితంగా ఉన్నమనే భావనతో ఉండాలి. దీనికోసం ఇలాంటి హింసాత్మకం ఘటనలకు పాల్పడిన వారికి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి” అని తన పోస్ట్ లో రాశారు.

మరోవైపు కెనడా ప్రతిపక్ష నాయకుడు పియెరె పొయిలివ్‌రె ప్రజలందరి సమైక్య భావ తీసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితిలను అంతం చేసేందుకు క‌ృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టొరోంటో ఎంపీ కెవిన్ వోంగ్ మాత్రం రాజకీయ నాయకులే ఈ పరిస్థితులకు కారణమని రాశారు. కెనడాలోని హిందువులు, క్రిస్టియన్లు, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను ఆపేందుకు రాజకీయ నాయకులు విఫలమయ్యారని.. ఉన్మాదులకు కెనడా స్థావరంగా మారిపోయిందని పోస్ట్ పెట్టారు. అయితే ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాత్రం తాజాగా హిందూ దేవాలయంలో జరిగిన హింసను ఖండించారు.

2023లో కూడా విండ్సర్ , మిస్సిసావుగా, బ్రాంప్టన్ లో హిందువులపై దాడులు జరిగాయి. కెనడా ప్రభుత్వం మతద్వేషాలను రెచ్చగొట్టే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలకు ఈ ఉదాహరణలు బలం చేకూరుతోంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×