BigTV English

Gary Kirsten: పాక్ వైఫల్యాలకు కారణాలివే: కోచ్ గ్యారీ కిర్ స్టెన్!

Gary Kirsten: పాక్ వైఫల్యాలకు కారణాలివే: కోచ్ గ్యారీ కిర్ స్టెన్!

Coach Gary Kirsten Said These are the Reasons for Pakistan’s Failures: టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఘోర వైఫల్యంతో గ్రూప్ దశ నుంచి తిరుగు ప్రయాణమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో సీనియర్ క్రికెటర్లు, ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందరూ కెప్టెన్ బాబర్ అజామ్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. దీంతో తను కూడా బదులిచ్చాడు. 11 మంది ఆటను, నేనొక్కడిని ఆడలేను కదా అని, ఘాటుగా సమాధానమిచ్చాడు.


ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా విజయంలో ఒకనాడు కీలకపాత్ర పోషించి, సక్సెస్ ఫుల్ కోచ్ గా పేరు పొందిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్ స్టెన్ ప్రస్తుతం పాకిస్తాన్ కోచ్ గా ఉన్నాడు. అయితే తను బయటపడలేదు కానీ, ఈ వైఫల్యంపై ఒక నివేదికను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి సమర్పించినట్టు తెలిసింది. అందులో పాకిస్తాన్ జట్టులో లోపాలన్నింటిని పూసగుచ్చినట్టు వివరించడమే కాదు, కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

ఇంతకీ తనేం చెప్పాడంటే.. జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, మరికొంత మంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారని గ్యారీ కిర్‌స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.


Also Read: పూరన్ ఊచకోత.. ఆఫ్గాన్ పై వెస్టిండీస్ ఘన విజయం

మాజీ టీ 20 కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ అమీర్ వీరిద్దరితో బాబర్ అజామ్ కి మాటలు లేవని చెప్పినట్టు సమాచారం. వీరే జట్టులో ప్రధాన బౌలర్లు. కెప్టెన్ బాల్ ఇస్తే బౌలింగు చేస్తున్నారంతే అని అన్నాడు. టీమ్ వర్క్ లేకుండా విజయాలు రావని అన్నాడు.  ఇదొక్కటే కాదు.. జట్టులో చాలామంది ఆటగాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని అన్నట్టు తెలిసింది.

తన కోచింగ్ కెరీర్ లోనే ఇంతలా ఫిట్ నెస్ లేని జట్టుని చూడటం ఇదే ఫస్ట్ టైమ్ అని అన్నాడని తెలిసింది. ఫామ్ లో లేని ఆటగాళ్లను, గ్రూప్ రాజకీయాలు చేసేవారిని జట్టు నుంచి తొలగించాలని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం. షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నారు. వారికి రెస్ట్ కావాలని చెప్పినట్టు తెలిసింది.

Also Read: Rohit Sharma: భారతీయులకి.. రోహిత్ శర్మ కౌన్సెలింగ్ !

అయితే ఇవన్నీ పీసీబీ పెద్దలకు తెలుసునని, కానీ వారికి కావల్సిన, అనుకూలంగా ఉండే ఆటగాళ్లతో ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలా 11మందినిచ్చి వెళ్లి ఆడమంటే
తనకి సాధ్యం కాదని  కిర్ స్టెన్ చెప్పి, చివరికి చేతులెత్తేసినట్టు తెలిసింది.

ఒకానొక సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో, గ్యారి కిర్ స్టెన్ మార్గదర్శకత్వంలో టీమ్ ఇండియా నెంబర్ వన్ గా ప్రపంచ క్రికెట్ ని ఏలింది. అలాంటి కిర్ స్టెన్ నేడు పాకిస్తాన్ జట్టుపై ఇలా చెప్పడం నెట్టింట సంచలనంగా మారింది.

Tags

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×