E-Paper
Advertisement

Newyear Celebrations: ఆనందోత్సాహాల మధ్య కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం.. అదరగొట్టిన యూత్..

Newyear Celebrations: ఆనందోత్సాహాల మధ్య కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం.. అదరగొట్టిన యూత్..
Advertisement

Newyear Celebrations: 2024 నూతన ఏడాదికి యావత్ ప్రపంచం గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది. అన్నింటి కంటే ముందుగా న్యూజిలాండ్ లో కొత్త ఏడాది వేడుకలు షురూ కాగా.. ఆ తర్వాత సిడ్నీ, జపాన్ రాజధాని టోక్యోలో వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో న్యూఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఆనందోత్సాహాల మధ్య ప్రజలు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు.

అలానే ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా నిర్వహించారు. ఇక్కడి ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ వద్ద చేపట్టిన బాణసంచా, లైటింగ్ విన్యాసాలు అదరహో అనిపించాయి. ప్రజలు పెద్ద ఎత్తున సిడ్నీ హార్బర్ వద్దకు విచ్చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిడ్నీలో జరిగే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి.

Advertisement

అటు జపాన్ రాజధాని టోక్యోలోను కొత్త ఏడాది స్వాగత సంబరాలు అంబరాన్నంటాయి. 2024కి ఘనంగా స్వాగతం పలుకుతూ.. బాణాసంచా కాల్చుతూ.. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

ఇక మన దేశం కూడా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబరాలు హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరుగా సెలబ్రేషన్స్‌ జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏ గల్లీలో చూసిన న్యూయర్ ఈవెంట్స్‌ కలర్‌ఫుల్‌గా సాగాయి. హైదరాబాద్ బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అందర్నీ కాసేపు అక్కడ సెలబ్రేషన్స్‌లో పాల్గొని అందరికీ విష్‌ చేసి వెళ్లిపోయారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంబరాలు ఘనంగా జరిగాయి.

Advertisement

ఏపీలోని గుంటూరు, వైజాగ్‌, విజయవాడలో అన్ని ప్రాంతాల్లో రాత్రి 12 గంటలు దాటిన తర్వాత భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వారందరికీ విష్‌ చేస్తూ యువకులు సందడి చేశారు. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బాణసంచా కాలుస్తూ కొత్త సంవత్సరానికి భారీగా ఘనంగా స్వాగతం పలికారు.

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×