BigTV English

NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..

NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..

NTPC Recruitment: నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌, ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, న్యూఢిల్లీ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం లో ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.


దేశంలోని అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), న్యూ దిల్లీ.. 81 జీడీఎంఓ/ మెడికల్‌ స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో మొత్తం 81 మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 81

ఇందులో జీడీఎంఓ/ మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోవచ్చు .

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో జీడీఎంఓ, ఫిజిషియన్, పీడియాట్రిక్, రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఆప్తల్మాలజిస్ట్, ఓ అండ్ జీ, ఈఎన్ టీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ALSO READ: Minister Sridhar Babu: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 30వేల మందికి ఉద్యోగాలు..

ఉద్యోగాలు వెకెన్సీ వారీగా చూసినట్లయితే..

జీడీఎంఓ: 20 ఉద్యోగాలు

ఫిజిషియన్: 25 ఉద్యోగాలు

పీడియాట్రిక్: 10 ఉద్యోగాలు

రేడియాలజిస్ట్: 4 ఉద్యోగాలు

ఆర్థోపెడిక్స్: 6 ఉద్యోగాలు

ఆప్తల్మాలజిస్ట్: 4 ఉద్యోగాలు

ఓ అండ్ జీ: 10 ఉద్యోగాలు

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్‌బీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 27

ఉద్యోగ ఎంపిక విధానం: అప్లకేషన్ ల షార్ట్ లిస్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 37 ఏళ్ల వయస్సు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. జీడీఎంఓ ఉద్యోగానికి నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వేతనం ఉంటుంది. మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి రూ.70,000 నుంచి రూ.1,80,000 జీతం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ntpc.co.in/

ALSO READ: BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..

అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Section Controller Jobs: రైల్వేలో భారీగా సెక్షన్ కంట్రోల్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నెలకు రూ.35,400 జీతం

ECIL Hyderabad: హైదరాబాద్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చుడే, డోంట్ మిస్

Prasar Bharati Jobs: ప్రసార భారతిలో నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. మంచి వేతనం, ఇంకా 6 రోజుల సమయమే

Telangana Jobs: తెలంగాణలో 1623 ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,37,050 జీతం.. ఇదే మంచి అవకాశం

IGI Aviation Services: ఎయిర్‌పోర్టుల్లో 1446 ఉద్యోగాలు.. టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్, ఇంకా 2 రోజులే గడువు

Telangana Police Jobs: నిరుద్యోగులకు బిగ్ గుడ్‌న్యూస్.. 12,452 పోలీస్ ఉద్యోగ వెకెన్సీలు.. ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్

Police Constable: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.81వేల జీతం.. ఇంకా 5 రోజులు మాత్రమే సమయం

Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం

Big Stories

×