Village Administration Officer Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అమలులోకి వచ్చిననుంచి నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాల తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి.. దేశంలో మరే రాష్ట్రం సాధించని విధంగా ఘనత చాటుకుంది. గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలను ఎలాంటి తప్పులు తడకలు లేకుండా సజావుగా నిర్వహించింది. అంతేగాక ఎగ్జామ్ నిర్వహించిన రెండు, మూడు నెలల్లోనే ఫలితాలను ప్రకటించింది.
ALSO READ: NABARD Jobs: కొడితే ఈ జాబ్ కొట్టాలి భయ్యా.. రూ.70లక్షల జీతం.. దరఖాస్తుకు మాత్రం ఇంకా..?
ముఖ్యంగా రేవంత్ సర్కార్ గతేడాది టీచర్ ఉద్యోగాలను రెండు నెలల్లోనే భర్తీ చేసింది. ఎగ్జామ్ నిర్వహించిన రెండు నెలల తర్వాతనే.. ఫలితాలు ప్రకటించింది. అంతేగాక అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చి ఉద్యోగాల్లోకి రిక్రూట్ చేసింది. వచ్చే 2, 3 నెలల్లో మళ్లీ గ్రూప్-1, 2 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రాష్ట్రంలో నియామక ప్రక్రియ సజావుగా సాగుతోందని చెబుతున్నారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పలు కీలక మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటు వంటి వీఆర్వో, వీఆర్ఏ విధానాన్ని తొలగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వారి సేవలను వినియోగించుకుంటామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, ప్రభుత్వం చెప్పినట్టుగానే వీఆర్ఏ, వీఆర్వోలను గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల్లో వినియోగించుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారి నుంచి ప్రభుత్వం ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి వీఆర్వో, వీఆర్ఏగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయనున్నారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులుంటాయి.
ALSO READ: Jobs: రాష్ట్రంలో 10,954 గవర్నమెంట్ జాబ్స్.. ప్రభుత్వం కీలక ప్రకటన
ALSO READ: ISRO Recruitment: ఐటీఐ, బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. ఇంకెందుకు ఆలస్యం