BigTV English

Trisha: ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది – త్రిష..!

Trisha: ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది – త్రిష..!

Trisha:ప్రముఖ నటి అందాల తార త్రిష (Trisha ) 40 సంవత్సరాలు దాటినా ఇంకా తన అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా సరే వరుస అవకాశాలు అందుకుంటూ పలు చిత్రాలతో బిజీగా మారిపోయింది. అలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైగానే ఉన్నాయని చెప్పవచ్చు. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో చేస్తున్న విశ్వంభర(Vishwambhara). ఇదిలా ఉండగా ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో అభిమానులను ఊరిస్తూ ఉంటుంది. ఒకపక్క ప్రొఫెషనల్ కి సంబంధించిన అప్డేట్ లతో పాటు వ్యక్తిగతమైన అంశాలు కూడా అభిమానులతో పంచుకుంటూ అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది త్రిష.


ప్రేమపై త్రిష కామెంట్స్..

తాజాగా ఎక్స్ ఖాతా ద్వారా ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ “ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది”అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవడంతో నెటిజన్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నావా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది “సూపర్ క్యూట్ గా ఉన్నావు” అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా నాలుగుపదుల వయసు దాటినా సరే ఇంకా ఇంత అందాన్ని మైంటైన్ చేస్తూ అందరిని అలరిస్తోంది త్రిష అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఒక ప్రస్తుతం త్రిష కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


త్రిష కెరియర్..

త్రిష కెరియర్ విషయానికి వస్తే.. చెన్నై మహానరంలో 1983 మే 4వ తేదీన కృష్ణన్, ఉమా దంపతులకు జన్మించింది. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఈమె అందాల పోటీలో పాల్గొని మిస్ చెన్నైగా ఎంపికయింది. ఆ తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో కూడా పాల్గొని బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికయింది త్రిష. ఇక త్రిష తన సినీ కెరియర్లో తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఇప్పటివరకు మూడు దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది. ఇక తెలుగులో ‘వర్షం’ సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. ఇకపోతే హీరోయిన్ గా నటించడానికి కంటే ముందు సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది త్రిష. ముఖ్యంగా ప్రశాంత్ హీరోగా నటించిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ పక్కన కనిపించి ఆకట్టుకుంది. ఇక ఎక్కువగా తెలుగు, తమిళ్ భాష ఇండస్ట్రీలపై ఫోకస్ చేసిన ఈమె హిందీలో ఒకటి, కన్నడలో ఒకటి, మలయాళం లో మూడు చిత్రాలు చేసింది. ఇక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన త్రిష పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అయితే సడన్గా ఇలా ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది అంటూ పోస్ట్ పెట్టడంతో కొంపతీసి ప్రేమలో పడిందా? నిశ్చితార్థం చేసుకుందా..? అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×