BigTV English

Adhi Pinisetty: బాలయ్యకు విలన్ అంటే తీసిపడేశారు.. అఖండ 2 కే హైలైట్ అయ్యేలా ఉన్నాడు

Adhi Pinisetty: బాలయ్యకు విలన్ అంటే తీసిపడేశారు.. అఖండ 2 కే హైలైట్ అయ్యేలా ఉన్నాడు
Advertisement

Adhi Pinisetty: కొన్ని పాత్రలు కొందరికి మాటమే సెట్ అవుతాయి. ఎలాంటి సినిమాలో అయినా ఎవరైనా హీరోలను గుర్తుపెట్టుకుంటారు. కానీ, కొన్ని సినిమాల్లోనే విలన్స్ ను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వారి పాత్ర, లుక్  అలా ఉన్నాయి కాబట్టి.  ఇక అలా విలన్స్  ను గుర్తుపెట్టుకోవాల్సి వస్తే  స్టైలిష్ విలన్ గా  ఆది పినిశెట్టిని  గుర్తుపెట్టుకోవచ్చు. రవిరాజా పినిశెట్టి నట వారసుడిగా ఒక విచిత్రం సినిమాతో ఆది కెరీర్ ను ప్రారంభించాడు. తమిళ్ లో హీరోగా మంచి మంచి సినిమాల్లో నటించాడు.


 

తెలుగులో కేవలం హీరోగానే కాకుండా నటుడుగా సంపూర్ణంగా ఎదగాలని అనుకున్న ఆది.. ఒక పక్క హీరోగా చేస్తూనే ఇంకోపక్క విలన్ గా, సపోర్టివ్ రోల్  లో నటిస్తూ బిజీగా మారాడు.  సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాల్లో ఆది నటనకు, లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హీరోలనే డామినేట్ చేశాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  ఇక విలన్ గానే కాకుండా రంగస్థలం లాంటి సినిమాలో సపోర్టివ్ రోల్ లో ఆది నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఆ సినిమాకు ఆదినే హైలైట్ అని చెప్పొచ్చు. అలా  వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కుంచుకుంటూ ఆది పైకి ఎదుగుతున్నాడు.


 

ఇక విలన్ గా ది వారియర్ సినిమాలో కనిపించినా ఈ సినిమా ఆదికి అంత గుర్తింపును అందివ్వలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఆది తన నట విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 . 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి ఒక్క పోస్టర్ వస్తే చాలు అనుకున్న ఫ్యాన్స్ కు రేపు బాలయ్య బర్త్ డే కావడంతో  ఏకంగా  టీజర్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు.

 

అసలు  బాలయ్య – బోయపాటి- థమన్ కలిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వడమే. టీజర్ మొత్తంలో బాలయ్య  తాండవం ఆడేశాడు.  ఈ టీజర్ లో బాలయ్య తాండవంతో పాటు ఒక్క షాట్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అదే ఆది పినిశెట్టి లుక్. ముఖాన్ని పూర్తిగా చూపించకపోయినా.. ఆ కళ్లను చుస్తే ఎవరికైనా భయం పుట్టాల్సిందే. ఒక కన్ను ఎర్రగా.. ఇంకో కన్ను అసలు లేనట్లు.. ముఖం మొత్తం కాలిన గాయాలు. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసుడును చూసినట్లు ఉంది.  బాలయ్యకు విలన్ గా ఆది నటిస్తున్నాడు  అని మేకర్స్  ప్రకటించినప్పుడు అందరు పెదవి విరిచారు.  ఆది ఎలా సరిపోతాడు.. ? చిన్న పిల్లాడిలా ఉంటాడు అంటూ కామెంట్స్ చేశారు. ఈ లుక్ చూసాక అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. సగం లుక్ చూస్తేనే ఇలా ఉంటే .. పూర్తి లుక్ అయితే  వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. ఏదిఏమైనా ఆది కెరీర్ లో అఖండ 2 ఒక మైలురాయిగా మిగులుతుందేమో చూడాలి.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×