హైదరాబాద్ లో ఉంటున్నారా? అందమైన పొద్దుతిరుగుడు పొలాల్లో చక్కటి ఫోటోలు దిగాలని ఉందా? సోషల్ మీడియాలో షేర్ చేసి చక్కటి లైకులు పొందాలనుందా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. హైదరాబాద్ శివార్లలోనే అందమైన పొద్దు తిరుగుడు తోటల అందంగా ఆహ్వానిస్తున్నాయి. బంగారు వర్ణంలో రా రమ్మంటూ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన సన్ ఫ్లవర్ ఫీల్డ్ కు సంబంధించిన రీల్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది. కాసేపట్లోనే బాగా వైరల్ అయ్యింది. ప్రకృతి ప్రేమికులు, నేచర్ ఫోటోగ్రాఫర్స్ ఈ ప్లేస్ కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే..
హైదరాబాద్ లో వైరల్ సన్ ఫ్లవర్ తోట ఎక్కడ ఉంది?
హైదరాబాద్ పరిసరాల్లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉండగా, ఇప్పుడు ఈ సన్ ఫ్లవర్ ఫీల్డ్స్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సుందరమైన పసుపు పూల తోటలు ఫేవరెట్ డెస్టినేషన్ గా మారిపోయాయి. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అర్షియా రీల్ లో ఈ తోటలకు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఆమె కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు వెళ్లే మార్గంలో అనుకోకుండా సన్ ఫ్లవర్ తోటలను చూసింది. ఇది ముద్దాపూర్ లోని కాసా ఫామ్ లోపల ఉంది. రిజర్వాయర్ కు వెళ్లే మార్గంలో ఒక గ్రామం. ముద్దాపూర్ హైదరాబాద్-మంచెరియల్ హైవే, హైదరాబాద్-రామగుండం హైవేకు ఆనుకుని ఉంటుంది. ఈ ఊరు మీదుగానే కొండపోచమ్మ సాగర్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ గ్రామం హైదరాబాద్ నుంచి 73 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి జస్ట్ 2 గంటల్లో ఆ స్పాట్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా వెళ్లవచ్చు.
ఎంట్రీ ఫీజ్ ఏమైనా ఉంటుందా?
నిజానికి ఈ పొద్దు తిరుగుడు తోటలలోకి వెళ్లేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. రైతు పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తున్నారు. అయితే, ఒకవేళ ఎవరైనా ఈ తోటలలోకి వెళ్లి ఫోటోలు తీసుకోవాలనుకుంటే.. రైతులు ఎలాంటి అభ్యంతరం చెప్పరు. అయితే.. పంటకు ఇబ్బంది కలగకుండా కాస్త జాగ్రత్తగా వెళ్లి ఫోటోలు తీసుకోవచ్చు అంటున్నారు రైతులు. అంతేకాదు. ఈ మొక్కలకు సంబంధించి కాండాలు శరీరానికి తాకితే దురద పుట్టే అవకాశం ఉంటుంది. కొంత మంది ఎలర్జీ కలుగుతుంది. అందుకే.. తోటలోకి వెళ్లే సయయంలో కాస్త కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ తోటలను ఎప్పుడు చూడాలి?
పొద్దుతిరుగుడు తోటలను ఎప్పుడు చూడాలనే విషయంలో నిర్ధిష్ట నియమాలు ఏమీ లేవు. కానీ, పొద్దుతిరుగుడు పువ్వులు వేసవిలో బాగా పెరుగుతాయి. సాధారణంగా మార్చి, జూన్ మధ్య నువ్వులు వికసిస్తాయి. పువ్వులు వాడిపోవడం, కోత కోయడం ప్రారంభించే ముందు సన్ ఫ్లవర్ ఫీల్డ్ ను సందర్శించడానికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు వెళ్లాలి అనుకుంటే, ఈ వీకెండ్ ప్లాన్ చేయడం బెస్ట్.
Read Also: ఈ రైళ్లలో వెళ్తే హిమాలయాలను చూడొచ్చు.. ఎప్పటికీ మరిచిపోలేరు!